/rtv/media/media_files/2025/09/22/hyderabad-rain-7-2025-09-22-18-44-46.jpg)
AP Rains Alert
ఉత్తర ఒడిశా మరియు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. గురువారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో ఆదివారం వరకు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించారు.
తగిన జాగ్రత్తలు తీసుకోవాలని..
ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో కోస్తా ఆంధ్రలో పలుచోట్ల అతి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జైన్ పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తమ వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గురువారం నుంచి ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచనలు జారీ చేశారు.
జిల్లాల వారీగా వాతావరణ హెచ్చరికలు:
రెడ్ అలర్ట్: విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: కోల్‌కతాలో రికార్డు స్థాయిలో వర్షం.. 9 మంది మృతి, 30 విమానాలు రద్దు
ఆరెంజ్ అలర్ట్: శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడవచ్చు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు, ముఖ్యంగా రైతులు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు కోరారు.
ఇది కూడా చదవండి: బంగాళాఖాతంలోఉపరితల ఆవర్తనం...ఎల్లుండి మరోసారి భారీ వర్షం