AP CM: అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. పోస్ట్ వైరల్!

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్ ఘన నివాళి అర్పించారు. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కోసం అంకితభావంతో కృషిచేద్దామన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని పిలుపునిచ్చారు. 

New Update
cm cbn

cm cbn Photograph: (cm cbn )

AP CM: అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఘన నివాళి అర్పించారు. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషిచేద్దామన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామంటూ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. 

దళితాభ్యుదయానికి పునరంకితం..

'ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది' అన్నారు భారతరత్న డా॥ భీంరావు రాంజీ అంబేద్కర్. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషిచేద్దాం. అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వంతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా , స్వాతంత్రోద్యమ వీరుడిగా... ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుందాం. దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదాం' అని కోరారు. 

అంబేడ్కర్‌కు హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌  తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి సీఎం ప్రాధాన్యమిస్తున్నారన్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తామని అంబేడ్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.

 భారతీయ సమాజానికి అంబేడ్కర్‌ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేడ్కర్‌ కృషి అమోఘం. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానం. అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారు. అంబేడ్కర్‌ స్ఫూర్తితో ప్రజాసంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దాం అని లోకేశ్‌ పిలుపునిచ్చారు.

cm-chandrababu | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు