/rtv/media/media_files/2025/10/04/ambati-2025-10-04-12-25-52.jpg)
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) పెద్ద కుమార్తె డాక్టర్ శ్రీజ వివాహం(Sreeja Wedding) అమెరికాలో ఘనంగా జరిగింది. అమెరికాలోని ఇల్లినాయిస్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హర్షతో ఆమె వివాహం హిందూసాంప్రదాయ ప్రకారం జరిగింది. ఈ శుభ కార్యక్రమం మహాలక్ష్మీ ఆలయంలో తెలుగు ఆచారాల ప్రకారం జరిగింది. దగ్గరి బంధువులు, స్నేహితులు ఈ వివాహానికి హాజరయ్యారు. ఇండియా నుండి నుండి చాలా మంది స్నేహితులు, బంధువులు వర్చువల్‌గా హాజరై తమ ఆశీస్సులను అందించారు. త్వరలోనే ఏపీలో రిసెప్షన్‌ను కూడా ప్లాన్ చేస్తామని అంబటి రాంబాబు వెల్లడించారు. కాగా డాక్టర్ శ్రీజ అక్కడే చదువుకుని ప్రస్తుతం ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎండోక్రినాలజీలో ఫెలోషిప్ వర్క్ చేస్తున్నారు. ఆమె భర్త హర్ష యునైటెడ్ స్టేట్స్‌లోని డ్యూయిష్ బ్యాంక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అంబటి అల్లుడు హర్దది పశ్చిమగోదావరి జిల్లా తణుకు కాగా.. ఆయనది కమ్మ సామాజిక వర్గం.
Also Read : వాహనదారులకు అదిరిపోయే న్యూస్.. నేడే వారి అకౌంట్‌లోకి రూ.15 వేలు.!
USA లో ఘనంగా అంబటి రాంబాబు కూతురు శ్రీజ వివాహ వేడుకలు.
— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) October 4, 2025
స్నేహితులు మధ్య కూతురు వివాహం చేసిన అంబటి రాంబాబు. pic.twitter.com/Wq9gA3a1NJ
శ్రీజ, హర్షలను అంబటి రాంబాబు అందరికి పరిచయం చేస్తూ ఓ వీడియో చేశారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. తన అల్లుడి గురించిన వివరాలు సరిగా తెలియదని.. తన కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకుందన్నారు. తమ కుమార్తె వివాహం ఆంధ్రప్రదేశ్‌లోనే జరగాల్సి ఉండగా, అమెరికాలో ఉన్న కొన్ని వీసా/నిబంధనల (ట్రంప్ ప్రభుత్వ విధానాల) కారణంగా కొద్దిమంది సమక్షంలో అక్కడే చేసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తన అల్లుడు హర్ష తల్లిదండ్రులు కూడా వివాహానికి రాలేకపోయారని.. వారికి వీసా సమస్యలు ఎదురైనట్లు తెలిపారు. మూడుసార్లు ప్రయత్నం చేసినా వీసా రాలేదన్నారు.. అందుకే వారు లైవ్‌లో పెళ్లి చూడాల్సి వచ్చిందన్నారు. వీళ్లిద్దరు ఏపీకి వచ్చిన సమయంలో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీజ, హర్ష ప్రేమ వివాహం చేసుకున్నారని కూడా అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అంబటి రాంబాబుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇది ఆయన కుమార్తెలలో ఒకరైన డాక్టర్ శ్రీజ వివాహం జరిగింది.
Also Read : పాలిటిక్స్ మొదలు పెట్టిన వల్లభనేని వంశీ.. మళ్లీ యాక్టీవ్
కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితం
అంబటి రాంబాబు తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించారు. 1989 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో (2005-2007) ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం, ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత అంబటి రాంబాబు అందులో చేరారు. 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగన్ మంత్రివర్గంలో జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1994, 1999లలో టీడీపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. 2019 వరకు ఆయనకు ఎమ్మెల్యేగా తిరిగి గెలవడానికి సుదీర్ఘ కాలం పట్టింది. 2019లో సత్తెనపల్లిలో కోడెల శివప్రసాదరావుపై విజయం సాధించారు.