ఇక ఆపండ్రా బాబు.. మాకీ పచ్చళ్ళు వద్దు | Alekhya Chitti Health Serious | Alekhya Chitti Pickles | RTV
అలేఖ్య చిట్టి హాస్పిటల్లో చేరింది. బ్రీతింగ్ ఇష్యూతో ICU వార్డులో కొట్టిమిట్టాడుతుంది. తన చెల్లికి సీరియస్‌గా ఉందని సుమీ ఓ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. తన చెల్లికి ఆక్సిజన్ తీసుకోవడం కూడా కష్టంగా ఉందంటూ తెలిపింది. దయచేసి ట్రోలింగ్ ఆపండంటూ వేడుకుంది.
అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ క్లోజ్ అయింది. ఇక నుంచి వారు మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇదే విషయాన్ని యూట్యూబర్ అన్వేష్ తెలిపాడు. త్వరలో రమ్య పేరుతో లడ్డూ బిజినెస్ ప్రారంభించబోతున్నారని అన్వేష్ తాజాగా చెప్పాడు.
అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీపై యూట్యూబర్ నా అన్వేష్ స్పందించాడు. ‘అలేఖ్య అలా తిట్టి ఉండకూడదు. వాళ్లు నా చెల్లెల్లాంటివారు. వారిని క్షమించండి. వారి కర్మబాగోలేక, బలుపు ఎక్కువై అలా చేసింది. త్వరలో లడ్డూ బిజినెస్ పెట్టబోతున్నారు’ అని చెప్పుకొచ్చాడు.
అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ తీవ్ర దుమారం రేపింది. ఈ వివాదంతో అలేఖ్య చిట్టి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో వైరల్‌గా మారింది. నాన్న ఉన్నా ధైర్యంగా ఉండేదని ఆ వీడియోలో అలేఖ్య చెబుతుంది.
అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదంపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించినట్లు మీమర్స్ ఓ వీడియో క్రియేట్ చేశారు. ‘కస్టమర్‌కు జరిగిన అవమానం గురించి నాకు చాలా బాధ కలిగింది. అందువల్ల అలేఖ్య చిట్టి పికెల్స్‌ను వెంటనే బాయ్ కాట్ చేయాలి’ అని చెప్పుకొచ్చారు.
గత రెండు రోజులుగా అలేఖ్య చిట్టి పికెల్స్ కాంట్రవర్సీ సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. ఈ వివాదంపై అలేఖ్య క్షమాపణలు తెలిపింది. ఓ వీడియో రిలీజ్ చేస్తూ.. ‘నేను తప్పు చేశాను. ఇప్పటి వరకు ఎవర్నైతే తిట్టానో వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను’ అని పేర్కొంది.