/rtv/media/media_files/2025/10/25/nagula-chavithi-2025-10-25-16-05-07.jpg)
Nagula Chavithi
Nagula Chavithi : నాగుల చవితి అనగానే మనకు గుర్తుకు వచ్చేది పాములకు పాలుపోయడం. నాగుల చవితి హిందువులకు ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ఆ రోజున ఆడపడచులంతా పుట్ట వద్దకు వెళ్లి నాగ దేవతకు పూజలు చేస్తారు. కొంతమంది నాగదేవత ప్రతిమలకు, విగ్రహాలకు పూజలు చేస్తుంటారు. తమను తమ కుటుంబానికి నాగదేవత ఎలాంటి ఆపద తలపెట్టవద్దని వేడుకుంటారు. ఎప్పుడైన నాగు పాము ఎదురుపడితే ఎలాంటి కీడు తలపెట్టమని, తమ కుటుంబానికి కూడా ఎలాంటి ఇబ్బంది తలపెట్టవద్దని కోరుకుంటారు. మరికొంతమంది పుట్టల వద్దకు వెళ్లి పసుపు కుంకుమతో పూజలు చేయడంతో పాటు పాముల కోసం ప్రత్యేక పాత్రల్లో పాలు పోయడం, గుడ్లు పెట్టడం చేస్తుంటారు. అలాగే సంతానం లేని వారు నాగ దేవత కటాక్షంతో ఆ కుటుంబంలో సంతాన సమృద్ధి కలుగుతుందని నమ్ముతారు. అందుకే పుట్ట వద్ద నాగుల చవితి రోజున ముగ్గులు వేసి దీపాలు వెలిగించి, పాలు, గుడ్లు, చలివిడితో పాటు నువ్వులు ,బెల్లంతో ప్రత్యేకంగా చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెడతారు. అయితే చాలా వరకు పుట్టల్లో పాము ఉన్నా లేకున్నా అక్కడ పూజలు చేయటం మాత్రం మరువరు. పుట్టలో పాము లేకపోయినా అందులో పాము ఉందన్న భావంతో పుట్ట వద్ద పూజలు చేస్తారు. ఇక నాగుల చవితి రోజున ఎవరికైనా నాగుపాము కనిపిస్తే తమకు దేవుడే సాక్షత్కరించాడని సంబుర పడుతుంటారు. నాగుల చవితి రోజున సాక్షాత్తు నాగ దేవతే తనపై కరుణించి దర్శన భాగ్యం కల్పించారని ఉబ్బితబ్బిబ్బవుతారు.
ఈ రోజు (శనివారం) నాగుల చవిత సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి అద్భుతమే ఒకటి జరిగింది. జిల్లాలోని పలాస మున్సిపాల్టీ పరిధిలోని శాసనం కాలనీలో నాగులచవితి సందర్భంగా భక్తులకు నాగు పాము దర్శనమిచ్చింది. నాగులచవితి పర్వదినం సందర్భంగా శనివారం ఉదయం స్థానికంగా ఓ చెట్టు కింద ఉన్న పుట్ట వద్ద భక్తులు చాలా భక్తిశ్రద్ధలతో పాలు, గుడ్లు పెట్టి పూజలు చేశారు. అయితే వారి పూజలు ఫలించాయన్నట్లు కొంత సమయానికే ఆ పుట్టలోనుంచి పాము బయటకు వచ్చింది. అది చూసిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అయితే పాము పుట్టలోనుంచి బయటకు వచ్చే సమయంలో బయటకు రావడానికి కొంత సమయం తటపటాయించింది. పుట్టలో నుంచి తలను బయటకు పెట్టి అటు ఇటూ చూసింది. పాము అలా చూడడంతో భక్తులంతా సైలెంట్ అయిపోయారు. అంతా సైలెంట్‌గా ఉండటంతో నెమ్మదిగా బయటకు వచ్చింది. అటు ఇటు తిరిగి పుట్ట వద్ద పాత్రలో పెట్టిన పాలను సైతం తాగడంతో భక్తులు ఆనందంతో మునిగి పోయారు. భక్తిశ్రద్ధలతో పుట్ట ప్రాంగణమంతా పసుపు కుంకుమతో అలంకరించారు.
పాములు పాలు తాగుతాయా?
నిజానికి పాములు పాలు తాగుతున్నట్లు అనిపించినా అది వాస్తవం కాదని నిపుణులు అంటున్నారు. పాలను జీర్ణం చేసుకునే శక్తి ఉండదు. అంతేకాదు అసలు వాటికి జీర్ఱవ్యవస్థ ఉండదని వారంటున్నారు.అయితే పాములు దాయంతో ఉన్న సమయంలో పాలల్లో తల ఆన్చుతాయని అంతుకానీ పాలు తాగే అవకాశం లేదని అంటున్నారు. మాంసాహారులైన పాములు ఎలుకలు, బల్లులు, గుడ్లు, చిన్న చిన్న కీటకాలను తింటాయి కానీ, పాములు పాలుతాగవని వారంటున్నారు. అంటే శాస్త్రీయంగా పాములు పాలను తాగవు అన్నది నిపుణుల అభిప్రాయం
Also Read: High Paying Jobs: ఫ్రెషర్లకు బెస్ట్ ఆప్షన్స్.. ఈ 5 ఉద్యోగాలకు లక్షల్లో జీతం.. అనుభవం అవసరమే లేదు!
Follow Us