/rtv/media/media_files/2026/01/20/death-2026-01-20-11-16-59.jpg)
A wife's anger at her husband led to Son death in West Godavari
West Godavari Crime: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. భార్తపై భార్య కోపం వాళ్ల కొడుకు ప్రాణాలను తీసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. భీమవరంలో లక్ష్మీ, వెంకట సుబ్బారావు దంపతులు నివసిస్తున్నారు. వీళ్లకు ఐదేళ్ల కుమారుడు మహరుద్ర కాంత్ ఉన్నాడు. కొన్ని నెలల క్రితం ఈ కుటుంబం కృష్ణా జిల్లా చల్లపల్లి నుంచి భీమవరం వచ్చింది. అయితే సోమవారం షాపింగ్‌కు వెళ్లేందుకు ఇంటికి త్వరగా రావాలని భార్య లక్ష్మీ భర్తకు చెప్పింది. కానీ సుబ్బారావు ఇంటికి రాలేదు.
Also read: ఆఫీసులో రాసలీలు.. కర్ణాటక డీజీపీ సస్పెండ్
దీంతో అతని భార్య కోపంతో కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకుని కొద్ది మోతాదులో తాగి పడుకుంది. మిగిలిన డ్రింక్‌ను ఇంట్లో ఉన్న కొడుకు మహరుద్ర తాగేశాడు. మంగళవారం తెల్లవారుజామున బాలుడికి విపరీతంగా వాంతులు రావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఏలూరుకు తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో బాలుడు మృతి చెందాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: అమెరికానా నో వే అంటున్న విద్యార్థులు..75శాతానికి పడిపోయిన అడ్మిషన్లు
Follow Us