/rtv/media/media_files/2025/09/02/rithu-chowdary-2025-09-02-08-47-48.jpg)
Rithu Chowdary
Ritu Chaudhary : ప్రముఖ టీవీఛానల్ లో ప్రచారమయ్యే కామెడీ షో జబర్దస్త్ ద్వారా బల్లితెరకు పరిచయమైన నటి రీతూ చౌదరి బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందిన రీతుచౌదరి తన గ్లామర్ తో వందలాది మంది అభిమానులను సంపాదించుకుంది. జబర్దస్త్ కామెడీ షోలో పాల్గొని తన గ్లామర్‌తో పాటు నటనతో అందరినీ ఆకట్టకుంది. ఎప్పటికపుడు తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరినీ అలరించడమే కాకుండా తన ఫాలోవర్స్ ను మరింత పెంచుకుంటోంది.ఇదిలా ఉండగా రీతూ కు బిగ్‌బాస్ 9లో అవకాశం వచ్చినట్లు తెలిసింది. సెప్టెంబర్ 7న ప్రారంభం కానున్న ఈ షోలో రీతూ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ అయిపోయిందని. అందులో రీతూ చౌదరి పేరు దాదాపు ఖాయమైందని తెలుస్తోంది.
Also Read : Trump: భారత్ ఆలస్యం చేసింది.. టారిఫ్‌లపై ట్రంప్ సంచలన ప్రకటన
రీతూ చౌదరి గ్లామర్ తో పాటు వివాదాల్లోనూ చిక్కుకుంది. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆమెపై పోలీసులు విచారణ కూడా జరిపారు. అదేకాక ఏకంగా రూ. 700 కోట్ల ల్యాండ్ స్కామ్‌లో ఆమె పాత్ర కూడా ఉందంటూ ప్రచారం సాగింది. అయితే ఈ విషయంలో ఆమె తనకేం సంబంధం లేదని, అందులో ఎలాంటి నిజం లేదని కావాలనే కొందరు తన పేరును ఇందులోకి లాగుతున్నారని ఆరోపించింది. అన్ని కోట్లు తనవద్ద ఉంటే ఇలాంటి కష్టాలు ఎందుకు పడుతానంటూ ప్రశ్నించింది. ఈ క్రమంలో బిగ్‌బాస్‌లోకి ప్రవేశించడం ద్వారా తనపై వచ్చిన ఆరోపణలను కొంత మేరకు అయినా తగ్గించుకోవచ్చని ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: ట్రంప్ తిక్క కుదిరింది.. విదేశీ విద్యార్థులు రాకపోవడంతో రూ.60 వేల కోట్ల నష్టం!
కాగా, రీతూ చౌదరి తండ్రి సుమారు రెండేళ్ల క్రితం మరణించాడు. దీంతో రితూ చౌదరినే తన కుటంబానికి పెద్ద దిక్కు అయింది. పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన గ్లామర్‌తో అందరిని ఆకట్టుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. సోషల్‌మీడియాలోనూ తన ఫ్యామిలీ కోసం కష్టపడుతుండటంతో ఆమె గురించి తెలిసినవాళ్లు మాత్రం ఫ్యాన్స్ అయిపోయారు. అయితే, బిగ్‌బాస్9 ద్వారా మరికొందరి ప్రేక్షకుల ప్రేమను గెలవచ్చు అనే రితూ చౌదరి ఎంట్రీ ఇస్తున్నట్లు ఆమె అభిమానులు అంటున్నారు
Also Read : Weather Update: ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు!