అనాథ విద్యార్థిని కొట్టి కొట్టి చంపిన సహవిద్యార్థులు.. ఆపై దారుణంగా! 9వ తరగతి చదివే ఓ అనాథ బాలుడు అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై తేలాడు. అయినా ఆ గ్రామస్థుల్లో మనవత్వం కనిపించలేదు. పోలీసులకు కూడా తేలిగ్గా తీసుకున్న ఈ ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో గత నెల 24న జరిగింది. ఆ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. By Seetha Ram 18 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి ఆ బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో నాన్నమ్మ దగ్గర ఉంటున్నాడు. ఓ రోజు స్కూల్‌లో కొందరి విద్యార్థులతో గొడవ జరిగింది. దీంతో మరుసటి రోజు అతడు స్కూల్‌కి వెళ్లలేదు. ఆ సమయంలోనే కొందరు విద్యార్థులు అతడి వద్దకు వచ్చి ఊరి పొలిమేరకు తీసుకుని వెళ్లారు. అక్కడ అతడిని కొట్టి కొట్టి చంపారు. ఆ తర్వాత ఆ డెడ్ బాడీని కనిపించకుండా దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో గత నెల 24న జరిగింది. అయితే మరి కొట్టి చంపిన ఆ విద్యార్థి డెడ్ బాడీని ఏం చేశారో అనే విషయానికొస్తే.. ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి ప్రభుత్వం తీపికబురు.. 100శాతం మినహాయింపు ఏం జరిగిందంటే? గుంటూరు జిల్లా అమరావతి మండలం కర్లపూడి బాలుడు షేక్ సమీర్ స్వగ్రామం. అతడి చిన్న తనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో పొన్నేకల్లులోని నాయనమ్మ మస్తాన్‌బీ దగ్గరే ఉంటున్నాడు. అదే గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి (బీ సెక్షన్) చదువుతున్నాడు. అయితే ఓ రోజు అదే క్లాస్‌కు చెందిన ఏ సెక్షన్ విద్యార్థులతో గొడవ జరిగింది. వారు సమీర్‌ను కొట్టి భయపెట్టారు. ఇది కూడా చదవండి: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు ఈజీ! దీంతో గత నెల 24వ తేదీన స్కూల్‌కు వెళ్లలేదు. ఇక అదే రోజు మధ్యాహ్నం స్కూల్‌లో మాక్ డ్రిల్ జరుగుతున్న సమయంలో కొందరు 9వ తరగతి విద్యార్థులు డ్రిల్ చేయకుండా బయటకు వెళ్లిపోయారు. అనంతరం సమీర్ దగ్గరకు వెళ్లి ఈత కొడదామని ఊరి పొలిమేర బావి వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ సమీర్‌ను చితక్కొట్టి ఆ బావిలో పడేసినట్లు తెలిస్తుంది. ఇది కూడా చదవండి: పెళ్లికాని ప్రసాద్‌లే టార్గెట్.. పెళ్లి చేసుకుని లక్షల్లో కన్నం! ఈ విషయం సాయంత్రానికి గ్రామస్థులు, ఉపాధ్యాయులకు తెలియడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో బాలుడు సమీర్ ఒంటిపై రక్తపు గాయాలు, దుస్తులుపై రక్తపు మరకలు కనిపించాయి. అయితే గ్రామస్థులు ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఉంచారు. పోలీసుల్ని మేనెజ్ చేసి పోస్టుమార్టం లేకుండా డెడ్ బాడీని రాత్రికి రాత్రి కర్లపూడి తరలించినట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: అయ్యయ్యో.. మార్చురీలో మృతదేహం కన్ను మాయం.. చేసింది మరెవరో కాదు! ఇక అక్కడ బాలుడి మృతదేహంపై ఉన్న గాయాలను చూసిన బంధువులు.. సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే పాఠశాలకు వెళ్లి ఆరా తీయడంతో.. ఉపాధ్యాయులు రూ.50 వేలు పోగిసి ఇవ్వాలని చూడగా.. దానికి సర్పంచ్ ఒప్పుకోలేదు. దీంతో ఆ బాలుడి నాన్నమ్మతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయించాడు. దీనిపై స్పందించిన డీఈవో సీవీ రేణుక వివరణ కోరగా ఆమె స్పందించారు. బాలుడి మృతి వాస్తవమేనని.. అయితే ఈత రాక బావిలో పడి చనిపోయినట్లు తనకు తెలిసిందని అన్నారు. ఆ రోజు కొందరు స్టూడెంట్స్ డ్రిల్‌కు రాకుండా బయటకు వెళ్లారని.. వారు ఎందుకు వెళ్లారో తెలుసుకుంటున్నాం అని చెప్పారు. దీనిపై విచారణ చేయిస్తాం అని పేర్కొన్నారు. #crime-news #gunturu #ap-crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి