అయ్యయ్యో.. మార్చురీలో మృతదేహం కన్ను మాయం.. చేసింది మరెవరో కాదు! ప్రభుత్వాసుపత్రిలో మృతదేహం కన్ను మాయమైన ఘటన పట్నాలో జరిగింది. ఇటీవల దండగుల కాల్పుల్లో ఫంతుష్ కుమార్ మరణించాడు. అనంతరం మార్చురీలో ఉన్న అతడి మృతదేహాన్ని పోస్టుమార్టంకి తీసుకొస్తుండగా ఎడమ కన్నులేదు. ఎలుకలు పెకిలించి ఉంటాయని వైద్యులు తెలిపారు. By Seetha Ram 18 Nov 2024 in నేషనల్ క్రైం New Update షేర్ చేయండి ఇదొ విచిత్రమైన ఘటన. ప్రభుత్వ హాస్పిటల్‌లో మృతదేహం కన్ను మిస్సింగ్ అయింది. ఆ కన్నును ఎలుకలు తినేసి ఉంటాయని హాస్పిటల్ డాక్టర్లు ఓవైపు చెప్తున్నారు. మరోవైపు సిబ్బందే ఆ కన్నును తొలగించినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఆ కన్ను ఎవరిది? అనే విషయానికొస్తే.. ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి ప్రభుత్వం తీపికబురు.. 100శాతం మినహాయింపు ఫంతుష్ కుమార్ మృతి ఈ నెల 15 (నవంబర్)న దండగుల కాల్పుల్లో ఫంతుష్ కుమార్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వెంటనే ఫంతుష్ కుటుంబ సభ్యులు అతడ్ని నలంద ప్రభుత్వ హాస్పిటల్‌లో జాయిన్ చేయించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఫంతుష్ అదే రోజు రాత్రి మరణించాడు. ఇది కూడా చదవండి: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు ఈజీ! కన్ను మాయం అనంతరం ఫంతుష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ఆపై ఆ మరుసటి రోజు ఉదయం పోస్టుమార్టం కోసం తీసుకురాగా.. కన్ను మాయమైనట్లు మృతుడి కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో హాస్పిటల్ యాజమన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చురీ నుంచి మృతదేహాన్ని తీసుకొస్తున్నపుడు ఎడమ కన్ను లేకపోవడాన్ని గుర్తించామన్నారు. అంతేకాకుండా పక్కనే సర్జికల్ బ్లేడ్ కూడా ఉన్నట్లు వారు తెలిపారు. ఇది కూడా చదవండి: పెళ్లికాని ప్రసాద్‌లే టార్గెట్.. పెళ్లి చేసుకుని లక్షల్లో కన్నం! వైద్యుల వెర్షన్ మరోవైపు వైద్యులు మాత్రం మృతదేహం కన్నును ఎలుకలు పెకిలించి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. దీంతో ప్రాథమిక సమాచారం మేరకు ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు నర్సులను సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారిని సస్పెండ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్...! #marchery #eye missing #ded-body #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి