గోదావరి జిల్లాలకు రూ.12 కోట్లు అత్యవసర నిధులు రిలీజ్ చేసిన ఏపీ ప్రభుత్వం

గోదావరి జిల్లాలకు అత్యవసర సహాయక చర్యల కోసం రూ.12 కోట్ల నిధులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అల్లూరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున, పశ్చిమ గోదావరికి రూ.2 కోట్లు, తూర్పుగోదావరి కోటి రూపాయలు మొత్తం 12 కోట్లు నిధులను వైసీపీ సర్కార్...

గోదావరి జిల్లాలకు రూ.12 కోట్లు అత్యవసర నిధులు రిలీజ్ చేసిన ఏపీ ప్రభుత్వం
New Update

గోదావరిలో వరదలు పోటెత్తడంతో లంక గ్రామాల్లో కష్టాలు మొదలయ్యాయి. లంక గ్రామాలకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో పలు లంక గ్రామాలు జలమయమయ్యాయి. గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఇప్పటికే లంక గ్రామాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రత్యేక కంట్రోల్ ఏర్పాటు చేశారు. అయితే వ్యవసాయ పనులు నిమిత్తం రాకపోకలు తప్పడం లేదంటున్నారు స్థానికులు.

Andhra pradesh government announce emergency floods aid godavari districts

ఈ క్రమంలో గోదావరి జిల్లాలకు అత్యవసర సహాయక చర్యల కోసం రూ.12 కోట్ల నిధులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అల్లూరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున, పశ్చిమ గోదావరికి రూ.2 కోట్లు, తూర్పుగోదావరి కోటి రూపాయలు మొత్తం 12 కోట్లు నిధులను వైసీపీ సర్కార్ మంజూరు చేసింది.

ఈ మేరకు రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్) స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ పేరిట జీవో విడుదలయ్యింది. అత్యవసర సహాయక కేంద్రాల ఏర్పాటుకు, ముంపు గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు, వరద బాధితులకు ఆహారం, నీరు, పాలు అందించేందుకు, అలాగే హెల్త్ క్యాంపు నిర్వాహణతో పాటు శానిటేషన్ కోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం తరపున ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

మరోవైపు గోదావరిలో వరద పోటెత్తడంతో లంక గ్రామాల్లో కష్టాలు మొదలయ్యాయి. రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి నిలకడగా కొనసాగుతుంది. కొద్దీ గంటలుగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 14.3 అడుగుల వద్ద గోదావరి వరద ప్రవహం కొనసాగుతోంది. బ్యారేజీ నుండి 13 లక్షల 57 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద సహాయక చర్యల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి ఏటిగట్లపై ఇరిగేషన్ సిబ్బంది విధుల్లోకి చేరారు. కోనసీమలో పొంగిపొర్లుతున్నాయి గోదావరి నదులు.. కోనసీమలోని వైనయతే, వశిష్ఠ, గౌతమి, వృద్ధగౌతమి నదులు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతికి కాజ్ వేలు నీటమునిగిపోవడంతో.. రాకపోకలు నిలిచిపోయాయి.

అలాగే పి.గన్నవరం మండలంలోని కనకాయలంక, అయినవిల్లి మండలంలో ఎదురు బిడియం కాజ్ వే లు పూర్తిగా నీట మునగడంతో స్థానికులు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. పి గన్నవరం మండలంలో వరద ఉధృతికి కాజ్‌ వేలు నీట మునిగాయి. జీ పెదపూడి లంక బూరుగులంక అరికెలవారి పాలెం దగ్గర ప్రమాదమైన కాజ్‌ వేలను ప్రజలు దాటుతున్నారు. పీ గన్నవరం నియోజకవర్గంలో లంక గ్రామాలకు భారీగా వరద నీరు చేరుతోంది. వరద ప్రవాహానికి కాజ్ ‌వేలు నీటమునగడంతో పాటు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు జీ పెదపూడి లంక, బూరుగులంక, అరికెల వారి పాలెం గ్రామస్తులు ప్రయాణాలు సాగిస్తున్నారు.

#andhra-pradesh #ap-news #latest-news #heavy-rains #monsoon #ggodavari-districts #andhra-padesh-government #emergency-floods-aid
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe