ఏపీలో భారీ వర్షాలు, వరదలపై సీఎం జగన్ ఏం అన్నారంటే..? గోదావరిలో వరద పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల పరిస్థితులతో పాటు, భారీ వర్షాలు కురుస్తున్న ఇతర ప్రాంతాల గురించి కూడా సీఎం జగన్.. By E. Chinni 28 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం సమావేశం చేపట్టారు. కలెక్టర్లతో పాటు పలువురు అధికారులతో ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్షా సమావేశంలో హోం మంత్రి తానేటి వని, సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంధ్రనాథ్ రెడ్డితో పాటు ఇతర ఉన్నాధికారులు పాల్గొన్నారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయాలని ఇప్పటికే ప్రభావిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు. గోదావరిలో వరద పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల పరిస్థితులతో పాటు, భారీ వర్షాలు కురుస్తున్న ఇతర ప్రాంతాల గురించి కూడా జగన్ ఆరా తీశారు. 42 మండలాల్లోని 458 గ్రామాలను అప్రమత్తం చేశామని ఈ సందర్భంగా సీఎం జగన్ కు అధికారులు తెలిపారు. గోదావరి నదీ తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ ముంపు బాధితులకు బాసటగా నిలవాలని సూచించారు. అయితే ఇప్పటికే పలు జిల్లాల్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు, అలాగే ముంపునకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో బోట్లు సహా సహాయక సిబ్బందిని సిద్ధం చేశామని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల విషయంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని, వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల కోసం ముందస్తుగా నిధులను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. కాగా కాసేపటి క్రితమే గోదావరి జిల్లాలకు అత్యవసర సహాయక చర్యల కోసం రూ.12 కోట్ల నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. అల్లూరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున, పశ్చిమ గోదావరికి రూ.2 కోట్లు, తూర్పుగోదావరి కోటి రూపాయలు మొత్తం 12 కోట్లు నిధులను వైసీపీ సర్కార్ మంజూరు చేసింది. ఈ మేరకు రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్) స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ పేరిట జీవో విడుదలయ్యింది. అత్యవసర సహాయక కేంద్రాల ఏర్పాటుకు, ముంపు గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు, వరద బాధితులకు ఆహారం, నీరు, పాలు అందించేందుకు, అలాగే హెల్త్ క్యాంపు నిర్వాహణతో పాటు శానిటేషన్ కోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం తరపున ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. #andhra-pradesh #ap-news #cm-jagan #heavy-rains #floods #andhra-pradesh-cm-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి