నగరం కింద మరో నగరం ఉంది-గాజా మీద దాడి అంత ఈజీ కాదు

హమాస్‌ను మట్టుబెట్టే లక్ష్యంతో ముందుకు వెళుతోంది ఇజ్రాయెల్. క్షిపణులు, వైమానిక దాడులతో గాజా మీద విరుచుకుపడుతోంది. సరిహద్దుల్లో మరింత సైన్యాన్ని, యుద్ధ ట్యాంకులను మోహరించింది. భూదాడులు నిర్వహించి హమాస్‌ను సమూలంగా నాశనం చేయాలనే అనుకుంటోంది. కానీ గాజాలో భూదాడులు చేయడం అంత ఈజీ కాదని నిపుణులు అంటున్నారు. గాజా కింద మరో గాజా ఉందని చెబుతున్నారు.

నగరం కింద మరో నగరం ఉంది-గాజా మీద దాడి అంత ఈజీ కాదు
New Update

హమాస్‌కు గాజా అతి పెద్ద కంచుకోట అంటున్నారు నిపుణులు. ఏళ్ళ తరబడి శ్రమించి అక్కడ రహస్య సొరంగ మార్గాలను ఏర్పరచుకుంది హమాస్. ఇవన్నీ శత్రుదుర్భేధ్యంగా ఉంటాయి. ఇజ్రాయెల్ భూదాడులకు తెగబడితే హమాస్ మిలిటెంట్లు భూ, ఆకాశ మార్గాలతో పాటూ సొరంగమార్గాలను కూడా వాడుకుంటారని చెబుతున్నారు. టన్నెల్స్ ను ఎలా, ఎప్పుడు వాడుకుంటారన్నది కూడా తెలుసుకోవడం కష్టమే అంటున్నారు.

ఈ టన్నెల్స్ లో హమాస్ కు ఫుల్ నెట్ వర్క్ ఉండడమే కాక ఆయుధాలను కూడా దాచుకుందని చెబుతున్నారు. బందీలను కూడా మిలిటెంట్లు అక్కడే దాచారని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. గాజాలో రెండు లేయర్లు ఉన్నాయి. ఒకటి సామాన్య పౌరులది కాగా రెండోది హమాస్ ది. రెండో దాన్ని కనిపెట్టడం చాలా కష్టంగా మారింది ఇజ్రాయెల్ కు. అంగడర్ గ్రౌండ్ నెట్ వర్క్ ను ఛేదించడం అంత ఈజీ కాదని చెబుతున్నారు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రతినిధి జొనాథన్ కొన్రికస్. గతంలో కూడా ఇజ్రాయెల్ చాలాసార్లు ప్రయత్నించిందని...ఎప్పుడూ కనిపెట్టలేకపోయిందని చెప్పారు. 2021లో దాదాపు 100 కిలోమీటర్ల పరిధిలోని టన్నెల్స్ ను బాంబులతో కూల్చేసింది. కానీ తర్వాత తమకు 500 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ నెట్ వర్క్ ఉందని హమాస్ ప్రకటించింది.

హమాస్ టన్నెల్స్ చాలా ఆధునికంగా ఉంటారు. 35 మీటర్ల లోతు ఉండి...రైల్ మార్గాలు, కమ్యూనికేషన్ గదులతో ఉంటాయి. వీటికి విద్యుత్, వెంటిలేషన్ మార్గాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. హమాస్ ఎన్నో ఏళ్ళుగా వీటిని ఉపయోగించుకుంటోంది. ఈ సొరంగ మార్గాలకు వెళ్ళే ప్రవేశాలు ఎక్కువగా నివాస భవనాలు, కార్యాలయాల్లోనే ఉన్నాయని చెబుతున్నారు.

Also Read:మరి కాసేపట్లో అధికారికంగా బీజెపీ ఫస్ట్ లిస్ట్ ప్రకటన

మరోవైపు దక్షిణ గాజా మీద ఇజ్రాయెల్ వరుస బాంబులతో దాడులు చేస్తూనే ఉంది. అక్కడి ఖాన్ యూనిస్ పట్టణం మీద బాంబుల మోత మోగించింది. నిన్న జరిగిన దాడిలో ఎనిమిది మంది మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారని తెలుస్తోంది. ఖాన్ యూనిస్‌లో ఆంబులెన్స్‌ల సైరన్ మోగుతూనే ఉంది. గాజాలో అతి పెద్ద రెండో ఆసుపత్రి అయి నాసర్ లో క్షతగాత్రులు జాయిన్ అవుతూనే ఉన్నారు. వీరితో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. మరోవైపు విద్యుత్ లేక, అత్యవసర వస్తువులు లేక అక్కడ వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు. మొబైల్ ఫోన్ లైట్లలో ఆపరేషన్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటిదాకా గాజాలో 4137 మంది చనిపోగా...13వేలమందికి పైగా గాయపడ్డారు.

ఇక ఈజిప్టు, దక్షిణ గాజా సరిహద్దు ప్రాంతంలో మూడువేల టన్నుల సహాయక సామాగ్రి రెడీగా ఉంది. మొత్తం 200 ట్రక్కులు అక్కడి నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ దాడులతో రఫాలో రోడ్లు దెబ్బతిన్నాయి. దీనివలన ట్రక్కులు ముందు వెళ్ళలేకపోతున్నాయి. దీంతో దక్షిణ గాజా సురక్షితమనుకుని ఉత్తర గాజా నుంచి వచ్చిన వారు ఇక్కడ కూడా దాడులు జరగుతుండడంతో దిక్కు తోచని పరిస్థితుల్లో పడిపోయారు. కొందరు మళ్ళీ తిరిగి ఉత్తర గాజాకు వెళ్ళిపోతున్నారు. మరోవైపు లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న కిర్యత్ ష్మోనా టౌన్‌ను ఇజ్రాయెల్ కాళీ చేయిస్తోంది. ఇక్కడి ఉంటున్న 20వేల మందిని ఇజ్రాయెల్‌కు తరలిస్తున్నారు. గజా మీద భూతల దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమైంది అనడానికి ఇది సంకేతమని విశ్లేషకులు అంటున్నారు.

#tunnels #war #israel #gaza #hamas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి