కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith Shah) కు తృటి లో పెను ప్రమాదం తప్పింది. రాజస్థాన్ (Rajasthan) లోని నాగౌర్(Nagour) లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నికల ప్రచార రథాన్ని ఒక్కసారిగా విద్యుత్ తీగలు(Current Wires) తాకాయి. దాంతో నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. అమిత్ షా బృందం బిడియాడ్ గ్రామం నుంచి పర్బత్ సర్ వెళ్తుంది.
ఈ క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పర్బత్ సర్ లో ఇరు వైపులా దుకాణాలు, ఇళ్లు ఉండడంతో రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు అమిత్ షా ప్రచారా వాహనాన్ని తాకాయి. దీంతో కరెంట్ తీగ తెగి కింద పడింది. ఈ విషయాన్ని గమనించిన బీజేపీ నేతలు, కార్యకర్తలు వెంటనే అప్రమత్తమయ్యారు.
Also read: దీపావళికి ట్రైన్ లో ఉరెళ్తున్నరా?.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి!
వెంటనే అమిత్ షా వాహనం వెనకాల ఉన్న అన్ని వాహనాలను నిలిపివేశారు. కరెంట్ సరఫరాను కూడా బంద్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో అమిత్ షా సహా ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారం కోసం అమిత్ షా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సారి ఎలాగైనా సరే రాజస్థాన్ లో బీజేపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న రాజస్థాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ స్పందించారు. ప్రమాదం తప్పడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also read: క్రికెట్ చరిత్రలో నెవర్ బిఫోర్..వెయ్యేళ్లు గుర్తిండిపోయే బ్యాటింగ్..!