Amabati Rambabu:పవన్ మునిగిపోయే పడవను లేపుతా అనడం విచిత్రం

జైలుకు వెళ్ళిన ఏ నాయకుడు తిరిగి అధికారంలోకి రాలేదన్నారు మంత్రి అంబటి రాయుడు. దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు జైలుకు వెళ్ళారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ను వచ్చి చంద్రబాబును మునిగిపోయే పడవను లేపుతా అనడం విచిత్రంగా ఉందని అంబటి వ్యాఖ్యానించారు.

Ambati Rambabu: చంద్రబాబుకి ప్రాజెక్టు ఇంకా అర్థం కాలేదు.. అందుకే నేను ముందే ఇలా చెప్పాను: అంబటి
New Update

Amabati Rambabu: చంద్రబాబు, పవన్ కల్యాణ్ (Chandrababu - Pawan kalyan) ల మీద ఆంధ్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరొకసారి వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన (TDP - Janasena) పొత్తు మీద సెటైర్లు వేశారు. చాలా మంది ముఖ్యమంత్రులు తప్పులు చేసి జైలుకు వెళ్ళారని...వాళ్ళల్లో ఎవరూ బతికి బట్టకట్టలేదని అన్నారు. జైలుకెళ్ళొచ్చిన వారు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం చరిత్రలో లేదని చెప్పారు. ఇప్నుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చి మునిగిపోయే పడవను పైకి లేపుతా అనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

చంద్రబాబుకు డబ్బులు బొక్కటమే తెలుసని..ఎలక్షన్ ఖర్చు పెరగడానికి కారణం చంద్రబాబేనని విమర్శలు చేశారు అంబటి. ఇప్పుడు అయ్యే ఎలక్షన్ ఖర్చుకు సామాన్యుడు పోటీ చేయలేడు...దానికి కారణం బాబేనని అన్నారు. డబ్బు దోచుకొని ఖర్చు పెట్టే వైఖరి చంద్రబాబుదని వ్యాఖ్యానించారు. టీడీపీ వాళ్ళు చిన్న పిల్లల చేత తిట్టిస్తున్నారు...అదేం బుద్ధి అంటూ మండిపడ్డారు. గంటకు కోటి రూపాయలు తీసుకునే లాయర్లు చంద్రబాబు కేసు వాదిస్తున్నారు.ఇంత పెద్ద లాయర్లు వాదించిన బెయిల్ రాలేదంటే చంద్రబాబు దొంగ అనే కదా అర్ధం అన్నారు అంబటి రాంబాబు. ప్రాథమికంగా చంద్రబాబు దొంగ.చంద్రబాబుని జైల్లో వేస్తే సింపతి పెరిగిందని లోకేష్ (Lokesh)  అంటాడు.బాబుని జైల్లో వేస్తే టీడీపీ బలహీన పడిందని పవన్ కళ్యాణ్ అంటాడు.బలహీన పడిందో,సింపతి పెరిగిందో పవన్ కళ్యాణ్, లోకేష్ మీరిద్దరూ తేల్చుకోండి అంటూ రాంబాబు వ్యంగ్యంగా మాట్లాడారు.

చంద్రబాబు పార్టీ బలహీన పడితే వాళ్ళ సంక ఎక్కడానికి రెడీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్.తండ్రి కొడుకులు ఇద్దరు రాష్ట్రాన్ని దోచుకుంటే ఆధారాలతో పట్టుకున్నారు. అవినీతిపరులు వెంట ఎందుకు ప్రయాణిస్తున్నావో పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి అంటూ అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు.

Also Read: Chandrayaan 3 - అంతా అయిపోయింది…ఇక ఆశల్లేవు

వంద పతకాలతో చరిత్ర సృష్టించిన భారత్- అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

#chandrababu #tdp #amabati-rambabu #pawan-kalyan #ycp #lokesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి