amazon prime:ఇక మీదట ఓటీటీల్లోనూ ప్రకటనలు తప్పవంట...

ప్రస్తుతం నడుస్తున్నది ఓటీటీ యుగం. థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసేవారు తక్కువా...ఓటీటీల్లో చూసేవారు ఎక్కువా అయిపోయారు. మొత్తం ఎంటర్టైన్ మెంట్ అబ్రివేషన్నే మార్చేసిన ఓటీటీలు కూడా టీవీల్లా తయారవనున్నాయి. టీవీల్లో యాడ్స్ వస్తున్నట్టు ఇక మీదట అమెజాన్ ప్రైమ్ లాంటి వాటిల్లో కూడా ప్రకటనలు వస్తాయని చెబుతున్నారు.

Amazon prime: అమెజాన్ ప్రైమ్ వాడే వారికి షాక్.. మళ్లీ రూ.250 కట్టాలా?
New Update

ప్రస్తుతం వినోదం మన చేతుల్లోనే ఉంది. సినిమాలు చూడాలంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఫోను, టీవీ, ల్యాప్ టాప్ ఏది ఉన్నా చాలు...అందులో ఓటీటీలు పెట్టుకోవడం ఎంచక్కా చూసేయడం. కరోనా తర్వాత ఓటీటీలకు జనాలు మరింత ఎక్కువగా అలవాటు పడిపోయారు. నెలకు ఇంత కడితే చాలు హాయిగా అన్నీ చూసేయొచ్చు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్స్...ఇలాంటివి చాలానే ఉన్నాయి. వీటిల్లో ప్రస్తుతం జియో సినిమాలు ఒక్కటే ఉచితంగా కంటెంట్ ను అందిస్తోంది. అయితే ఇప్పుడు నెమ్మదిగా ఓటీటీలు తమ రంగును మార్చుకుంటున్నాయి. ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనలూ లేకుండా కంటెంట్ ను అందిస్తోన్న ఓటీటీలు నెమ్మదిగా యాడ్స్ వైపు అడుగులు వేస్తున్నాయి.

డిస్నీ హాట్ స్టార్స్ ఎప్పటి నుంచో సినిమా, సీరీస్ ల మధ్యలో యాడ్స్ ను ఇస్తోంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కు కూడా అదే బాట పట్టనుందని తెలుస్తోంది. దీని ప్రకారం వీటిల్లో సినిమా లేదా సీరీస్ చూడ్డం మొదలెట్టగానే యాడ్ వస్తుంది. దాన్ని మనం స్కిప్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్ లో మొదట్లో ఒక్కటే యాడ్ వస్తోంది. కానీ నెమ్మదిగా వాటిని పెంచునుందిట. మధ్యలో కూడా యాడ్స్ వచ్చేలా చర్యలు తీసుకుంటోందిట. వీటిని స్కిప్ అయితే చేసుకోవచ్చు కానీ పూర్తిగా రాకుండా ఆపేయలేము. దీనికి కూడా పరిష్కారం చూపిస్తోంది అమెజాన్ ప్రైమ్. యాడ్స్ ప్రీ కంటెంట్ చూడాలంటే నెలవారీ చెల్లిస్తున్నది కాకుండా అదనంగా మరికొంత చెల్లిస్తే ప్రకటనలు రావు అని చెబుతోంది.

ఓటీటీలు బాగా పాపులర్ అవడంతో...ఇవి తమ చందాదారులను పెంచుకోవడమే కాకుండా వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే యాడ్స్ ను ఇవ్వడం, పాస్ వర్డ్ షేరింగ్ ను పరిమితం చేయడం లాంటివి చేస్తున్నాయి. ప్రస్తుతం భాట్ స్టార్, అమెజాన్ యాడ్స్ బాట పట్టాయి. తొందరలోనే నెట్ ఫ్లిక్స్ కూడా ఇదే పని చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతానికి ఇండియాలో అమెజాన్ ప్రైమ్ టాప్ లో ఉంటే...యూఎస్ ఓటీటీల్లో నెట్ ఫ్లిక్స్ నెం.1 లో ఉంది.

#video #netflix #ott #entertainment #amazon-prime #movies #free #disney-hot-star #ads #series
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe