ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు అల్లు అర్జున్. కొద్ది రోజుల క్రితం ఆయనకు జాతీయ అవార్డు వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. 69 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రంలో జాతీయ అవార్డు అందుకున్న ఏకైక నటుడు అల్లు అర్జునే కావడం విశేషం.
ఈ క్రమంలోనే బన్నీ జాతీయ అవార్డు అందుకోవడంతో పాటు మిగిలిన జాతీయ అవార్డు విన్నర్స్ కి కూడా మైత్రీ మూవీ మేకర్స్ గండిపేటలో పెద్ద పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి టాలీవుడ్ నుంచి ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా అవార్డు అందుకున్న బన్నీ మాట్లాడాడు.
బన్నీ మాట్లాడుతూ..భావోద్వేగానికి గురయ్యాడు కూడా. తన 20 ఏళ్ల కల నిజమైందని..నాతో పాటు దేవి శ్రీ ప్రసాద్ కూడా ఈ అవార్డ్ అందుకోవడం చాలా ఆనందాన్నిచ్చిందని తెలిపారు. ఎప్పటి నుంచో దేవికి బాలీవుడ్ కి వెళ్లామని చెప్తున్నాను. దానికి దేవి ఎప్పుడూ ముందు నువ్వు వెళ్లు బన్నీ..నీ వెనకే నేను వస్తాను అని చెప్పుకొచ్చేవాడు.
ఇద్దరం ఒకేసారి పుష్ప సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టాం. అక్కడ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ మాట నిజమైంది. జాతీయ అవార్డులు ప్రకటించిన రోజు నాకు, దేవికి వచ్చినట్లు పేర్లు ప్రకటించడంతో నాకంటే మా నాన్న ఎక్కువ సంతోషించారు. నా ఇద్దరు కొడుకులకు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.
నేను కూడా ఢిల్లీకి వస్తాను...దేవి వాళ్ల నాన్న సత్య మూర్తి లేకపోయినప్పటికీ నేను ఉన్నాను. దేవి కూడా నా కొడుకే నా ఇద్దరు కొడుకులు అవార్డులు తీసుకోవడం నేను చూడాలి అని ఆయన అన్నారు. అప్పుడు నేను '' నాన్న మేం సాధించాం. మీ భాషలో చెప్పాలంటే..స్కూళ్లు, కాలేజీల నుంచి ఎప్పుడూ ప్రిన్సిపల్స్ నుంచి టీసీలు తీసుకునే మేము..అంటే ఇద్దరు పోరంబోకులు..ప్రెసిడెంట్ దగ్గర మెడల్స్ తీసుకుంటామని అనుకున్నావా?'' అని అడిగాను.
జీవితంలో ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని మనం అనుకుంటాం. కానీ మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్నవారు కూడా గట్టిగా అనుకోవాలి. అలా అయితేనే అది సాధ్యం అవుతుంది. నాకు అవార్డు రావాలని నాకంటే గట్టిగా దర్శకుడు సుకుమార్ కోరుకున్నాడు.
అందుకే నాకు ఈ అవార్డు వచ్చింది. దీని ఎచీవర్ ఎప్పటికీ ఆయనే..నేను కేవలం అచీవ్ మెంట్ మాత్రమే అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు. అయితే నా బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి కాంప్లిమెంట్ ఏంటో తెలుసా? ఏరా ఎప్పుడు టీసీలు తీసుకోవడమే తప్పా? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి మెడల్ తీసుకుంటుంటే నాకెంతో బాధగా ఉందో తెలుసా? అని అన్నారు. ఇదే బెస్ట్ కంప్లిమెంట్ నాకు అన్నారు బన్నీ.