Pushpa2 Tickets : దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 'పుష్ప2' మేనియా నడుస్తోంది. ఐకాన్ అల్లు అర్జున్ - క్రియేటివ్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 5 న రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కు ఇంకో రెండు వారాలు మాత్రమే ఉంది. ఈ క్రమంలో 'పుష్ప' బ్రాండ్ ను ఎక్కడపడితే అక్కడ వాడేస్తున్నారు.
ఇందులో భాగంగానే 'పుష్ప' క్రేజ్‌ని వాడుకోవాలి అనుకున్న ప్రముఖ ఈ కామర్స్ సంస్థ బ్లింక్ ఇట్ తమ వినియోగదారులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. తమ యాప్‌లో కిరాణా సమాన్లు కొనుకున్నవారికి 'పుష్ప 2' టికెట్ వోచర్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.
ఇది కూడా చదవండి: నకిలీ RTO ఘరానా మోసం.. ఈ ట్విస్టు ఊహించడం కష్టమే భయ్యా!
ఇది కూడా చదవండి: జ్ఙాపకశక్తిని 10 రెట్లు పెంచే అద్భుతమైన ఆహారాలు
ఇలా చేస్తే 'పుష్ప2' టికెట్ ఫ్రీ..
అయితే రూ.999 కంటే ఎక్కువ ఆర్డర్ చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఈ ఆఫర్ నవంబర్ 23 నుంచి నవంబర్ 29 వరకు ఉంటుందని ప్రకటించింది. మరింకెందుకు ఆలస్యం వెంటనే బ్లింక్ ఇట్ లో గ్రోసరీస్ కొనుగోలు చేసి 'పుష్ప2' టికెట్ ను ఫ్రీగా పొందండి. ఇదిలా ఉంటే 'పుష్ప 2' నుంచి ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకొని మరింత హైప్ పెంచింది.
ఇది కూడా చదవండి: అదానీపై కేసు వ్యవహారం.. వైట్‌హౌస్ స్వీట్ రియాక్షన్!
రిలీజైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ అందుకున్న ట్రైలర్ గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. జగపతి బాబు, రావు రమేష్, ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీలీల స్పెషల్ సాంగ్ లో మెరవనుంది.
ఇది కూడా చదవండి: తెలంగాణలో 13 నర్సింగ్ కాలేజీలకు అనుమతి