Allu Arha: మట్టి వినాయకుడిని తయారు చేసిన అల్లు అర్హ..క్యూట్ వీడియో వైరల్..!!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. తండ్రి వలె కూతురు కూడా స్టార్డమ్ ను సొంతం చేసుకుంది. వినాయక చవితి సందర్భంగా అర్హ మట్టి గణపయ్యను తయారు చేసింది. చిట్టి చిట్టి చేతులతో అర్హత మట్టి వినాయకుడిని తయారు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Allu Arha: మట్టి వినాయకుడిని తయారు చేసిన అల్లు అర్హ..క్యూట్ వీడియో వైరల్..!!
New Update

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. తండ్రి వలె కూతురు కూడా స్టార్డమ్ ను సొంతం చేసుకుంది. వినాయక చవితి సందర్భంగా అర్హ మట్టి గణపయ్యను తయారు చేసింది. చిట్టి చిట్టి చేతులతో అర్హత మట్టి వినాయకుడిని తయారు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అల్లు అర్హ ఈ మధ్యే సమంత నటించిన శాకుంతలం సినిమాలో భరతుడి పాత్రలో నటించి అందర్నీ మెప్పించింది. ఈ చిన్నారి మరోసారి తన టాలెంట్ ను చూపించింది. వినాయక చవితి సందర్భంగా మట్టితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసింది. తన చిట్టి చిట్టి చేతులతో ఎంతో శ్రద్ధ పెడుతూ వినాయకుడిని తయారు చేసింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అర్హ టాలెంట్ చూసిన నెటిజన్స్ కూడా మురిసిపోతున్నారు. సూపర్ అర్హ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


కాగా గతంలో అల్లు అర్హ చెప్పిన కొన్ని క్యూట్ డైలాగ్స్, డ్యాన్స్ వీడియోలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. గతనెల తన సోదరుడికి రాఖీ కట్టిన ఫొటో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూలో అర్హా అరంగేట్రం గురించి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, "నా బిడ్డను తెరపై చూడటం చాలా సంతోషంగా ఉంది అన్నారు. అర్హా అరంగేట్రం అల్లు కుటుంబంలోని నాలుగవ జనరేషన్ అని చెప్పొచ్చు. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప 2: ది రూల్' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇందులో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'పుష్ప 2' ఆగస్టు 15, 2024న విడుదల కానుంది.

ఇది కూడా చదవండి: ఆ సమయంలో నొప్పి వేధిస్తోందా? ఈ సింపుల్ టిప్స్‎తో చెక్ పెట్టండి..!!

#ganesh-chaturthi-2023 #ganesh-idol #allu-arjun #allu-arha #allu-arhaganesh-idol
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe