TSRTC Nimajjanam Special Buses: గణేశ్ భక్తులకు ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త.. నిమజ్జనానికి 535 స్పెషల్ బస్సులు.. వివరాలివే!
హైదరాబాద్ లో ఈ నెల 28న గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. భక్తుల సౌకర్యార్థం 535 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.