Defence Budget 2024: గత ఏడాది రూ. 5.94 లక్షల కోట్లు. మూలధన వ్యయం రూ.1.72 లక్షల కోట్లుగా నిర్ణయించారు. దానిని ఈ ఏడాది మరింత పెంచుతూ రక్షణ కోసం కొత్త బడ్జెట్‌లో రూ. 6.21 లక్షల కోట్లను కేటయించారు. అంటే లాస్ట్ ఇయర్ కన్నా 1.05 లక్షల కోట్లు (రూ. 1,05,518 కోట్లు) ఎక్కువ. ఇది రక్షణ రంగంలో ఆత్మనిర్భర్త (స్వయంశక్తి)కి మరింత ఊపునిస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ కేటాయింపులకు గానూ ఆయన నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. రూ. 1,72,000 కోట్ల మూలధన వ్యయం సాయుధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుంది. దేశీయ మూలధన సేకరణ కోసం రూ. 1,05,518.43 కోట్లు కేటాయించడం ఆత్మనిభర్తకు మరింత ఊపునిస్తుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
Also Read:Budget 2024: రూ. 3 లక్షల లోపు జీతం ఉన్న వారికి నో టాక్స్..