Budget 2024: రక్షణ బడ్జెట్ రూ. 6.21 లక్షల కోట్లు నిన్న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రక్షణ కోసం రూ.6.21 లక్షల కోట్లను కేటాయించారు. దీంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వ మొత్తం బడ్జెట్‌లో రక్షణ రంగానికి మొత్తం కేటాయింపు 12.9 శాతం గా ఉంది. By Manogna alamuru 24 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Defence Budget 2024: గత ఏడాది రూ. 5.94 లక్షల కోట్లు. మూలధన వ్యయం రూ.1.72 లక్షల కోట్లుగా నిర్ణయించారు. దానిని ఈ ఏడాది మరింత పెంచుతూ రక్షణ కోసం కొత్త బడ్జెట్‌లో రూ. 6.21 లక్షల కోట్లను కేటయించారు. అంటే లాస్ట్ ఇయర్ కన్నా 1.05 లక్షల కోట్లు (రూ. 1,05,518 కోట్లు) ఎక్కువ. ఇది రక్షణ రంగంలో ఆత్మనిర్భర్త (స్వయంశక్తి)కి మరింత ఊపునిస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ కేటాయింపులకు గానూ ఆయన నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. రూ. 1,72,000 కోట్ల మూలధన వ్యయం సాయుధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుంది. దేశీయ మూలధన సేకరణ కోసం రూ. 1,05,518.43 కోట్లు కేటాయించడం ఆత్మనిభర్తకు మరింత ఊపునిస్తుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. Also Read:Budget 2024: రూ. 3 లక్షల లోపు జీతం ఉన్న వారికి నో టాక్స్.. #defence #nirmala-sita-raman #crores #rajnath-singh #budget-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి