Alleti Maheshwar Reddy: ధరణి పోర్టల్‌తో (DHARANI) బీఆర్ఎస్ నేతలు వేల కోట్ల ఎకరాలు కబ్జా చేశారని వార్తలు వచ్చాయని అన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి. ఆ నేతలు ఎవరు? కాజేసిన భూమి ఎది? అనేది కాంగ్రెస్ (Congress) బహిర్గతం చేయడం లేదని అన్నారు. మరి కాకి లెక్కలు చెప్తున్నారా?.. భూములు ఎవరు కాజేశారనేది వెల్లడించాలని డిమాండ్ చేశారు. మంత్రి మాట్లాడుతూ భూముల విషయం మీ అంతరాత్మకు తెలుసు అని మాట్లాడుతున్నారని అన్నారు.
ప్రజా సమస్యలు ఇక్కడ కాక ఎక్కడ మాట్లాడతారు?, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు రికవరీ చేశారు?, గతంలో ఇది 2 లక్షల కోట్ల కుంభకోణం అంటూ ఆరోపణలు చేశారని.. మరి ఎందుకు CBI కి ఇవ్వడం లేదు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి.. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. డిసెంబర్ 23న ధరణి పై కమిటీ వేశారు.. అది ఎప్పటి వరకు పూర్తి అవుతుంది? అని ప్రశ్నించారు.
సీఎంగా రెండవ రోజే రేవంత్ (CM Revanth Reddy) ధరణి పై రివ్యూ చేస్తే.. న్యాయం జరుగుతుందని రైతులు అభిప్రాయ పడ్డారని అన్నారు. ఈ పోర్టల్ ను గత ప్రభుత్వం విదేశీ కంపెనీకి అప్పగిస్తే.. ఈ ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు? అని నిలదీశారు. ఫారెస్ట్ భూములు, ప్రభుత్వ భూములు తగ్గాయని అంటున్నారు.. బీఆర్ఎస్ భూభకాసురులు కాజేశారా?, ధరణి పోర్టల్ నిర్వహణను NIC కి ఇచ్చే ఆలోచన ఉందా?, ధరణి పోర్టల్ పై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపిస్తారా ? జరిపిస్తే ఎప్పటిలోగా జరిపిస్తారు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Also Read: జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిన భట్టి విక్రమార్క