BIG Breaking: తెలంగాణ జాబ్ క్యాలెండర్ విడుదల.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే?

జాబ్ క్యాలెండర్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో విడుదల చేశారు. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందనే వివరాలను జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్నారు. పోస్టుల సంఖ్యను నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో వెల్లడిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.

New Update
BIG Breaking: తెలంగాణ జాబ్ క్యాలెండర్ విడుదల.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే?

Telangana Job Calendar Released: జాబ్ క్యాలెండర్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో విడుదల చేశారు. జాబ్ క్యాలెండర్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. తాము ప్రభుత్వంలోకి రాగానే ఉద్యోగాల భర్తీని వెంటనే చేపడతామని.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేస్తామని గతంలో హామీ ఇచ్చామని గుర్తు చేశారు. హామీ మేరకు నేడు జాబ్ క్యాలెండర్ ను ప్రజా ప్రభుత్వం విడుదల చేశామన్నారు.

కేవలం ఏ నోటిఫికేషన్ ఏ రోజున విడుదల అవుతుందనే వివరాలు మాత్రమే జాబ్ క్యాలెండర్ లో ఉంటాయన్నారు. అయితే.. పోస్టుల సంఖ్య నోటిఫికేషన్ విడుదల సమయంలో ప్రకటిస్తామన్నారు. పాత గ్రూప్-1 నోటిఫికేషన్ ను రద్దు చేసి.. 60 ఖాళీలను కలిపి 563 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేశామని గుర్తు చేశారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు