Alla Ramakrishna Meet Sharmila : షర్మిల(Sharmila) ను కలిసి అన్ని విషయాలను చర్చించాను అని చెబుతున్నారు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి(Alla Ramakrishna Reddy). వైసీపీకి ఎంతో సేవ చేశాను కానీ నాకు అవమానాలే మిగిలాయని ఆవేదన వ్యకంత చేశారు. ఇక మీదట నుంచి షర్మిల వెంటే నడుస్తానని తేల్చి చెప్పేశారు. ఆమె ఏపీ కాంగ్రెస్ లోకి వస్తే మంగళగిరి నుండి పోటీ చేయాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. మంగళగిరి అభివృద్ధి చెందాలి. దాన్ని మొదట రూ.1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పారు కానీ కేవలం రూ.120 కోట్లను మాత్రమే కేటాయించారు. నా సొంత డబ్బుతో నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు చేశా. 50 ఏళ్ళలో జరగని అభివృద్ధి నాలుగేళ్ళలో చేసి చూపించా. స్వయంగా నేనే రూ.8 కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చానని చెప్పుకొచ్చారు ఆళ్ళ.
Also read:ప్రజాపాలన దరఖాస్తు అమ్మకాల మీద సీఎం రేవంత్ సీరియస్
అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్...ధనుంజయ రెడ్డి కలమని చెబుతారు. కానీ ఆయన ఫోన్లు లిఫ్ట్ కూడా చేయడు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తేనే ఓట్లు అడిగి హక్కు ఉంటుంది.సంక్షేమం ఎంత చేసినా ప్రజలు అభివృద్ధిని మాత్రమే చూస్తారన్నారు ఆళ్ళ రామకృష్ణ. రాజధాని రైతులకు మద్దతుగా ఉండాలా లేదా అనేది నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత చెప్తాను. తొమ్మిదిన్నర సంవత్సరాలు వైసిపి కోసం పనిచేశా కానీ ఇకపై వైసీపీలో ఉండేది లేదని చెప్పారు. తాను ఎవరినీ నిందించడం లేదని...తన రాజీనామాను ఆమోదించకపోవడం వాళ్ళమని చెప్పారు. తాను పార్టీ వీడడానికి సమాధాన్ సీఎం జగనే చెప్పాలని అంటున్నారు ఆర్కే. తనను చాలా మంది ఇతర పార్టీల్లోకి రావాలని ఆహ్వానించారని కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. అందుకే షర్మిలతో ఉండాలనే నిర్ణయించుకున్నానని తెలిపారు. జగన్ తనకు పార్టీ టికెట్ ఇవ్వలేదని పార్టీ వీడలేదని...పొమ్మనలేక పొగబెట్టారని ఆర్కే ఆవేదన వ్యక్తం చేశారు.