ప్రస్తుతం దేశం మొత్తం శీతాకాలం మొదలవుతున్న తరుణంలో దక్షిణ భారతదేశంలో మాత్రం చాలా తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కేరళలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ 27 వరకు కేరళలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
సౌత్ ఇండియాలో ఆదివారం కూడా భారీ వర్షం కురుస్తుంది. తమిళనాడు, కేరళలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షం జల్లులు కురుస్తున్నాయి. దీంతో తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగాయి. అటు రాజస్థాన్ లో కూడా వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు.
Also read: ఈ ఏడాది దసరా పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? 23న లేక 24న?
రాజస్థాన్ లో అధికారులు ఇప్పటికే ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పంజాబ్, పశ్చిమ హిమాలయ ప్రాంతంలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు వివరించారు. బికనీర్, బార్మర్, జైసల్మేర్ , శ్రీ గంగానగర్ లో కూడా వానలు పడుతున్నట్లు తెలిపారు. దేశ రాజధాని నగరంలో మేఘాలతో కూడిన వర్షాలు పడుతున్నట్లు అధికారులు వివరించారు.
నగరంలో రోజురోజుకి తగ్గుతున్న ఉష్ణోగ్రతలు ఒకటి రెండు రోజుల్లో పెరిగే అవకాశలున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. గరిష్ఠంగా 33 డిగ్రీల నుంచి కనిష్ఠంగా 18 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. దేశంలో తేజ్ తుపాన్ తీవ్రత తారా స్థాయికి చేరనుందని ఐఎండీ తెలిపింది.
ఐఎండీ సమాచారం ప్రకారం..ఆదివారం మధ్యాహ్నానికి తేజ్ తీవ్రతరంగా మారే అవకాశలున్నట్లు తెలుస్తుంది. తుపాన్ వల్ల ఈదురు గాలులు వీస్తున్నాయని ..గంటకు 62 కిలో మీటర్ల నుంచి 88 కిలో మీటర్ల వరకు వీస్తాయని అధికారుల అంచనా వేస్తున్నారు. కాగా ఈ ఈదురు గాలుల వేగం గంటకు 89 కిలో మీటర్ల నుంచి 117 కిలో మీటర్లకు చేరితే దాన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఐఎండీ వివరించింది.
ఈ తేజ్ తుఫాన్ ప్రభావం గుజరాత్ పై అధికంగా ఉన్నట్లు నిపుణులు వివరించారు. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న గుజరాత్ తూర్పు ప్రాంతం పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని ఐఎండీ తెలిపింది.
ఈ ఏడాది జూన్‌లో అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుఫాను గుజరాత్ ను అతలాకుతలం చేసింది. ఇప్పుడు మరోసారి తేజ్ తుఫాను గుజరాత్ ను తాకబోతుంది.