ప్రస్తుతం దేశం మొత్తం శీతాకాలం మొదలవుతున్న తరుణంలో దక్షిణ భారతదేశంలో మాత్రం చాలా తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కేరళలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ 27 వరకు కేరళలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
పూర్తిగా చదవండి..ఆ రాష్ట్రంలో వర్షాలకు నీట మునిగిన రోడ్లు..మరో 8 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
తమిళనాడు, కేరళలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షం జల్లులు కురుస్తున్నాయి. దీంతో తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగాయి. అటు రాజస్థాన్ లో కూడా వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు.
Translate this News: