Rafah: ట్రెండ్ అవుతున్న 'All Eyes on Rafah'.. అసలు స్టోరీ ఇదే

పాలస్తీనాలోని రఫా నగరంలో ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతోంది. చిన్నారులు, మహిళలతో సహా.. 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే పలువురు సెలబ్రిటీలు ఆన్‌లైన్ వేదికగా ఈ దాడిని ఖండిస్తున్నారు.

New Update
Rafah: ట్రెండ్ అవుతున్న 'All Eyes on Rafah'.. అసలు స్టోరీ ఇదే

పాలస్తీనాలోని రఫా నగరంలో ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతోంది. చిన్నారులు, మహిళలతో సహా.. 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే పలువురు సెలబ్రిటీలు ఆన్‌లైన్ వేదికగా.. ఈ దాడిని ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం 'All Eyes on Rafah' అనే పదం ట్రెండింగ్‌ అవుతోంది.

Also Read: కార్లు కడిగితే రూ.2000 ఫైన్ .. సర్కార్ షాకింగ్ నిర్ణయం

ఇది మరణహోమం

మనదేశంలో.. ప్రముఖ నటులైన.. సమంత, రష్మిక, త్రిష, ప్రియాంక చోప్రా, పార్వతి తిరువొత్తు, దుల్కర్ సల్మాన్, అలియా భట్‌ తదితరులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో 'All Eyes on Rafah'తో ఉన్న ఓ ఫొటోను షేర్ చేస్తూ.. కాల్పుల విరమణకు అభ్యర్థిస్తున్నారు. 'ఇది ఘర్షణ కాదు.. యుద్ధం కాదు.. మరణహోమం' అంటూ పార్వతి తిరువొత్తు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులందరూ ప్రేమ, రక్షణ, శాంతి, సురక్షిత జీవనానికి అర్హులని ఆలియ భట్‌.. తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. గాజాలో కాల్పుల విరమణకు పిలుపునిస్తూ సమంత ఒక పోస్టును రీషేర్ చేశారు. యునిసెఫ్ గుడ్‌విల్‌కు అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక చోప్రా ఈ విషయంలో మౌనంగా ఉండటంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె కూడా ఆల్‌ ఐస్ ఆన్ రఫా అనే ఇమేజ్‌ను షేర్ చేశారు.

ఆదేశాలు పట్టించుకోకుండా

ఇదిలాఉండగా.. రఫాపై దాడిని వెంటనే ఆపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (IJC) ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌ దాడికి దిగింది. దాడి జరిగినటువంటి తల్‌ అల్‌ సుల్తాన్ ప్రాంతం సురక్షిత ప్రదేశమని ఇటీలే ఇజ్రాయెల్ ప్రకటన చేసింది. దీంతో ఉత్తర, మధ్య గాజా నుంచి తరలివచ్చిన పాలస్తీనియన్లు ఇక్కడ గుడారాలు వేసుకొని ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఈ ప్రాంతంలోనే ఇజ్రాయెల్ తాజాగా దాడి చేయడంతో సర్వత్రా విమర్శలు ఎదరవుతున్నాయి.

Also Read: అవును..మేము ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించాం..పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలనం

క్లారిటీ ఇచ్చిన ఇజ్రాయెల్

అయితే ఈ దాడికి ఇజ్రాయెల్ స్పందించింది. తమకు వ్యతిరేకంగా ఉగ్రదాడులు అమలు చేస్తున్న ఇద్దరు హమాస్ నేతలు ఈ ప్రాంతంలోనే దాక్కున్నట్లు తమకు కచ్చితమైన సమాచారం వచ్చిందని.. దాని ఆధారంగానే దాడి జరిపామని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ప్రమాదవశాత్తు అక్కడ అగ్నిప్రమాదం జరిగిందని.. హమాస్ నేతలు దాచిన మందుగుండు సామాగ్రి పేలడంతో పెద్ద ప్రమాదం జరిగి గుడారాల్లో ప్రజలు మరణించారని పేర్కొంది. మా దాడుల వల్ల ఇది జరగలేదని తెలిపింది. ఈ దాడులు కేవలం హమాస్ నేతల కోసమేనని.. గాజా ప్రజల కోసం కాదని స్పష్టం చేసింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు