USA : వాషింగ్టన్‌లో మొదలైన నాటో సమావేశాలు.. జో బైడెన్‌పై పెరుగుతున్న అసమ్మతి

ఈ ఏడాది నవంబ్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. జో బైడెన్, ట్రంప్‌లు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే బైడెన్ వృద్ధాప్యం, మతిమరుపు లాంటి సమస్యలతో సొంత పార్టీ ఎంపీల నుంచే అసమ్మతి ఎదుర్కొంటున్నారు. మరోవైపు నాటో వార్షిక సమావేశాలు వాషింగ్టన్‌లో మొదలయ్యాయి.

USA : వాషింగ్టన్‌లో మొదలైన నాటో సమావేశాలు.. జో బైడెన్‌పై పెరుగుతున్న అసమ్మతి
New Update

NATO Meeting : అమెరికా (America) లోని వాషింగ్టన్‌లో నాటో (NATO) మూడు రోజల వార్షిక సమావేశాలు మొదలయ్యాయి. నాటో 75వ వార్షికోత్సవం జరుగుతోంది. ఈ సందర్భంగా రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు మరింత మద్దతునిచ్చేందుకు యూఎస్ ప్రతిజ్ఞ చేసింది.

మరోవైపు రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తమ అదృష్టాలను పరీక్షించుకోవడానికి జో బైడెన్ (Joe Biden), ట్రంప్‌ (Trump) లు సిద్ధమయ్యారు. అయితే జో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ అయిన డెమోక్రాట్ల నుంచి అసమ్మతి రేగుతోంది.రీసెంట్‌గా ట్రంప్‌తో జరిగిన వాగ్వాదంలో బైడెన్ చేతులెత్తేశారు. పైగా ఆ టైమ్‌లో తనకు ఒంట్లో బాగా లేదని సాకులు చెప్పడానికి ప్రయత్నించారు. దీనిపై డెమోక్రాట్లు అసంతృప్తిగా ఉన్నారు. కానీ బైడెన్ మాత్రం అందుకు ఒప్పుకోడం లేదు. పార్టీలోని అంతర్గత నాటకాలు, వదంతులను ఇక కట్టిపెట్టాలని ఆయన స్పష్టం చేశారు. రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్‌ ట్రంప్‌ను ఓడించే సత్తా తనకు మాత్రమే ఉందని బైడెన్ అంటున్నారు. విశ్వాసం లేకపోతే ఎన్నికల బరిలో నిలిచేవాడ్ని కాదని అన్నారు. పోటీ తాను ఉన్నానని, ఇక వెనుదిరిగేది లేదని తెగేసి చెప్పారు. అంతేకాదు, అధ్యక్షుడిగా మూడున్నరేళ్లుగా తాను కనబరిచిన పనితీరును 90 నిమిషాల డిబేట్‌తో తీసిపారేయలేరని బైడెన్‌ వ్యాఖ్యానించారు.

Also Read:Patanjali: పతంజలి నుంచి 14 రకాల వస్తువు బ్యాన్..రాందేవ్ బాబా నిర్ణయం

#elections #usa #donald-trump #joe-biden #nato
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe