Chandrayaan-3: బ్రిక్స్ సదస్సులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ప్రధాని మోదీ..!! ఆగస్టు 23, 2023 గురువారం సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు భారత్ సరికొత్తచరిత్ర సృష్టించింది. దక్షిణ ధృవం వద్ద సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా భారత్ అవతరించింది. ఈ ఘనతపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సహా పలువురు ప్రపంచ నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని మోదీ..చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్ గా నిలిచారు. By Bhoomi 24 Aug 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి PM Modi is the center of attraction at the BRICS summit : బుధవారం బ్రిక్స్ సదస్సు సందర్భంగా విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ప్రధాని మోదీ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) మిషన్ విజయవంతం అయిన తర్వాత, ప్రపంచదేశాలకు చెందిన నేతలు ప్రధాని మోదీని అభినందించారు. చాలా మంది నేతలు ప్రధాని మోదీని కలుసుకుని మిషన్ విజయవంతమైనందుకు కంగ్రాట్స్ చెప్పారు. ఇందులో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) కూడా పాల్గొన్నారు. PM Modi celebrating #Chandrayaan3 success with Indian diaspora in South Africa VC : PTI#VikramLander #NarendraModi #PMSLive #ISRO #PragyanRover #Moon #BRICS #BRICSSummit pic.twitter.com/C0NRBJ1qgb— Vinod (@vinodgounder7) August 23, 2023 మిషన్ విజయవంతం కావడంపై దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారతీయసంతతికి చెందినవారు ప్రధాన మంత్రి మోదీ (PM Modi)ని ప్రశంసించారు. జోహన్నెస్‌బర్గ్‌లో కూడా చంద్రయాన్-3 విజయవంతమైన ఉత్సాహాన్ని సెలబ్రెట్ చేసుకున్నట్లు ట్వీట్ చేశారు. జోహన్నెస్‌బర్గ్ (Johannesburg)లోని ఓ హోటల్‌లో భారతీయ సంతతికి చెందిన వారిని కలిసిన ఫొటోలను కూడా ప్రధాని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతకుముందు ప్రధాని మోదీ చంద్రయాన్ -3 మిషన్‌ను ప్రస్తావిస్తూ , అంతరిక్ష రంగంలో భారతదేశం సాధించిన విజయాల పట్ల దక్షిణాఫ్రికాలో ఉన్న మన ప్రవాసుల ఉత్సాహం నిజంగా హృదయపూర్వకంగా ఉందని అన్నారు. #WATCH दक्षिण अफ्रीका: प्रधानमंत्री नरेंद्र मोदी ने जोहान्सबर्ग के एक होटल में एकत्र हुए प्रवासी भारतीयों से मुलाकात की। pic.twitter.com/2fHn55ncOp— ANI_HindiNews (@AHindinews) August 23, 2023 విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన వెంటనే , చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా దిగిన నాల్గవ దేశంగా భారత్ అవతరించింది. భారత్ కంటే ముందు అమెరికా, చైనా, రష్యాలు ఈ ఘనత సాధించాయి. అయితే, చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్ అవతరించింది. పాఠశాలలు, విజ్ఞాన కేంద్రాలు, ప్రభుత్వ సంస్థలతో సహా దేశవ్యాప్తంగా సాఫ్ట్ ల్యాండింగ్ కు సంబంధించి ప్రత్యేక ప్రదర్శనలు జరిగాయి. ఇస్రో ప్రత్యక్ష ప్రసారాన్ని ఇస్రో (ISRO) వెబ్‌సైట్, దాని యూట్యూబ్ ఛానెల్, ఫేస్‌బుక్, పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ DD నేషనల్ టీవీలో అందుబాటులో ఉంచింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 14న అంతరిక్ష నౌకను ప్రయోగించారు. Feeling the fervour all the way from Johannesburg for Chandrayaan-3! The enthusiasm of our diaspora in South Africa for India's achievements in the space sector is truly gladdening. pic.twitter.com/ApPdiQI9Fd— Narendra Modi (@narendramodi) August 23, 2023 చంద్రయాన్-3 విజయవంతం అయిన తర్వాత, ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నుండి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్ సోమనాథ్‌కు (S Somanath) ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. మొత్తం బృందానికి వ్యక్తిగతంగా స్వాగతం పలికేందుకు త్వరలో అక్కడకు వస్తానని చెప్పారు. "సోమ్‌నాథ్ జీ, మీ పేరు సోమనాథ్, ఇది చంద్రునితో ముడిపడి ఉంది, అందువల్ల మీ కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు" అని ప్రధాని మోదీ ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కు ఫోన్ చేసి అన్నారు. మీకు, మీ టీమ్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు. వీలైతే, నేను త్వరలో మిమ్మల్ని వ్యక్తిగతంగా అభినందిస్తానంటూ తెలిపారు. #WATCH जोहान्सबर्ग, दक्षिण अफ़्रीका | चंद्रयान-3 की सफलता के तुरंत बाद प्रधानमंत्री नरेंद्र मोदी ने इसरो प्रमुख एस सोमनाथ को फोन कर बधाई दी। pic.twitter.com/g62NkiTpr1— ANI_HindiNews (@AHindinews) August 23, 2023 బ్రిక్స్ సదస్సు (BRICS Simmit) కోసం దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో చూశారు. చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు కమలా హారిస్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భూటాన్ ప్రధాని సహా పలువురు నేతలు భారత్‌ను అభినందించారు. Also Read: ముంబైలో జికా వైరస్ మొదటి కేసు..అప్రమత్తమైన బీఎంసీ..!! #pm-modi #chandrayaan-3 #rtv-news #pm-modi-news #rtv-news-telugu #vikram-lander #brics-summit #15th-brics-summit #brics-summit-2023-in-south-africa #brics-banquet-dinner #world-leaders-congratulate-pm-modi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి