PM Modi : బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు దక్షిణాఫ్రికాకు బయలుదేరిన ప్రధాని మోదీ..!!
భారతప్రధాని నరేంద్రమోదీ నేటి నుంచి నాలుగు రోజుల పాటు దక్షిణాఫ్రికా, గ్రీస్ లో పర్యటించనున్నారు. ఆగస్టు 22 నుంచి 24వరకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ లో మూడు రోజుల పర్యటన సందర్భంగా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు మతమెలా సిరిల్ ఆహ్వానం మేరకు 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. 2019తర్వాత వ్యక్తిగతం జరిగే మొదటి బ్రిక్స్ సమ్మిట్ ఇది. గ్రూపింగ్ ద్వారా ప్రారంభించిన కార్యక్రమాల పురోగతిని సమీక్షించడంతోపాటు, భవిష్యత్ కార్యాచరణ ప్రాంతాలను గుర్తించేందుకు ఈ సమ్మిట్ అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.