T20 World Cup: న్యూజిలాండ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్థాన్

టీ20 వరల్డ్‌కప్‌లో మళ్ళీ సంచలనం నమోదయింది. పెద్ద జట్టు న్యూజిలాండ్‌కు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ గట్టి షాక్ ఇచ్చింది. 84 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

New Update
T20 World Cup: న్యూజిలాండ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్థాన్

New Zealand Vs Afghanistan: టీ20 వరల్డ్‌కప్‌లో చిన్న జట్లు అద్భుతాలు చేస్తున్నాయి. నిన్న యూఎస్‌ఏ జట్టు ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ టీమ్. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ 20 ఓవర్లలో 159 పరుగులు చేయగా..తరువాత లక్ష్య చేధనకు దిగిన కీవీస్ 15.2 ఓవర్లలో 75 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బ్యాటర్లు మొదటి నుంచే చేతులెత్తేశారు. మరోవైపు ఆఫ్ఘాన్ బౌలర్లు అద్భుతంగా రాణించారు.

బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ..

మొదట బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్తాన్ బ్యాటర్లలో గుర్భాజ్ 80, జద్రాన్ 44 పరుగులు చేశారు. బౌలింగ్‌లో రషీద్ ఖాన్, ఫజల్ హాక్ ఫారూఖీ చేరో నాలుగు వికెట్లు తీసుకోగా..మహ్మద్ నబీ 2వికెట్లు తీసుకున్నారు. న్యూజిలాండ్‌ టీమ్‌లో బ్యాటర్లు అందరూ విఫలమవ్వగా..ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ తలో వికెట్ తీసుకున్నారు. అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన రెహమానుల్లా గుర్బాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

సూపర్‌ 8కు..

ఇక ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇది రెండో విజయం. దీంతో ఈ టీమ్ సూపర్ 8కు చేరే అవకాశాలు ఉన్నాయి. గ్రూప్‌ సీలో ప్రస్తుతం ఆఫ్ఘన్ టీమ్ మొదటి స్థానంలో ఉంది. ఈ టీమ్ తరువాతి రెండు మ్యాచ్‌లు పపువా న్యూగినియా, వెస్టిండీస్‌లతో ఆడనుంది. పెద్ద జట్టైన న్యూజిలాండ్‌ మీదే గెలిచిన ఆఫ్ఘాన్‌ టీమ్‌కు మిగతా రెండు మ్యాచ్‌లూ గెలవడం అంత పెద్ద కష్టమేమీ కాదు.

Also Read: Ramoji Rao: అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు..సీఎం రేవంత్ ఆదేశాలు

Advertisment
తాజా కథనాలు