Bengaluru: యాక్టర్ హేమకు షరతులతో కూడిన బెయిల్

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు ఎట్టకేలకు కాస్త ఊరట అభించింది. ఆమెకు బెంగళూరు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రస్తుతం హేమ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.

New Update
Actress Hema: నేను రాలేను.. పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా.!

Actor Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్ అయ్యారు. మొదట తాను ఆ పార్టీకి వెళ్ళలేదంటూ తప్పించుకోవాలని చూసిన ఆమె తర్వాత తనంతట తానే వచ్చి లొంగిపోయారు. ప్రస్తుతం హేమ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇప్పుడు ఆమెకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో హేమ రేపు జైలు నుంచి విడుదల కానున్నారు.

ఈరోజు బెంగళూరు హైకోర్టులో బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఇందులో హేమ తరఫు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి తన వాదనలు వినిపించారు. తన క్లయింట్ అయిన హేమ దగ్గరవద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని కోర్టుకు తెలిపారు.

Also Read:Andhra Pradesh:ఏపీకి సూపర్ గుడ్ న్యూస్.. రూ.50 వేల కోట్ల ప్రాజెక్టు?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు