navdeep:ఐదు గంటలుగా కొనసాగుతున్న విచారణ, నవదీప్ అరెస్ట్?

తెలుగు నటుడు నవదీప్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణకు హాజరయ్యారు. మాదక ద్రవ్యాల కేసులో ఈరోజు విచారణకు హాజరు కావాల్సిందిగా నార్కొటిక్ బ్యూరో అధికారులు రెండురోజుల క్రితం అతనికి 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే నవదీప్​ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ కార్యాలయంలో విచారణకు వచ్చారు. నాలుగు గంటలగా విచారణ జరుగుతోంది.

navdeep:ఐదు గంటలుగా కొనసాగుతున్న విచారణ, నవదీప్ అరెస్ట్?
New Update

మొత్తానికి నటుడు నవదీప్ పోలీసు విచారణకు హాజరయ్యాడు. డ్రగ్స్​ కేసులో A29గా ఉన్న అతడిని కేసుకు సంబంధించిన పలు అంశాలపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.నాలుగు గంటలుగా నవదీప్ విచారణ కొనసాగుతోంది. విచారణలో హీరో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నాడని తెలుస్తోంది. ఎన్డ్రనిసార్గ్స్లు అడిగినా డ్రగ్స్ కొనుగోలు చేయలేదని చెప్తున్నట్టు సమాచారం.రామచంద్ర కు తనకు ఆర్థిక లావాదేవీలు ఉన్న మాట వాస్తవమేనని కానీ అవి డ్రగ్స్ కు సంబంధించినవి కాదంటున్నాడు నవదీప్. పబ్ లకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు ఆధారాలు చూపించగా...దానికి మౌనమే సమాధానంగా ఉందని తెలుస్తోంది. డ్రగ్స్ వినియోగదారుడిగా హీరోని గుర్తించామని నార్కోటిక్ పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అతను రామ్ చందర్ దగ్గరే కాక ఎవరెవరి నుంచి మాదక ద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నారనే కోణంలో ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబరు 14న తెలంగాణకు సంబంధించిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు, గుడిమల్కాపూర్ పోలీసు అధికారులతో కలిసి బెంగళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్ల సహా పలువురును అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి కొకైన్ తో పాటూ పలు రకాల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విచారణలోనే.. డ్రగ్స్ వ్యాపారులతో నవదీప్ సంప్రదింపులు జరిపినట్టుగా తమ విచారణలో తేలిందని అధికారులు వెల్లడించారు. అరెస్టైన నిందితుల్లో ఒకరైన రామచందర్​ దగ్గర నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. నవదీప్ తో పాటూ తెలుగు సినీ నిర్మాతలు, పలువురు ప్రముఖులు ఈ కేసులో ఉన్నారు. ఇప్పటికే వెంకట్, బాలాజీ తో పాటూ మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే నవదీప్ మాత్రం ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ వస్తున్నారు. డ్రగ్స్ విషయం బయటపడిన దగ్గర నుంచీ మాయం అయిపోయాడు. ఈ క్రమంలోనే నవదీప్ ముందు జాగ్రత్తగా బెయిల్ పిటీషన్ వేయగా హైకోర్టు దాన్ని తిరస్కరించింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నోటీసులు ఇచ్చి.. విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. నవదీప్ కూడా పోలీసుల విచారణకు హాజరు కావాలని గట్టిగా చెప్పింది.

#investigation #navdeep #police #hyderabad #case #actor #narcotice #drgs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి