Road Accident: రోడ్డు ప్రమాదాలకు అంతే లేకుండా పోతోంది. రోజు ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, తాగా వామవాలు నడపడం, రాంగ్ సౌడ్ పార్కింగ్, హైవేల్లో లైట్లు లేకుండా వాహనాలు ఆపడం లాంటి వాటితో దారుణాలు జరిగిపోతున్నాయి. తాజాగా అమలాపురంలో నలుగురు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. యానం లో బర్త్ డే పార్టీ చేసుకుని వస్తుండగా ప్రమాదం సంభవించింది. మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల జతిన్ పుట్టినరోజు సందర్భంగా ఎనిమిది మంది యువకులు యానంలో ఆదివారం రాత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అర్ధరాత్రి వరకు యానాం లో ఫుల్లుగా మద్యం సేవించి ఆటోలో రిటర్న్ అయ్యారు. ఈ దారిలో రాత్రి 12.30 గంటలకు అమలాపురం మండలం భట్నవిల్లి దగ్గర తమ ఆటోతో ఓ లారీని ఢీకొట్టారు. తాగిన మత్తులో బళ్ళు నడపకూడదని తెలిసి కూడా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు.
అందరూ 30 ఏళ్ళ లోపు వారే..
ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 4 గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వీరి పరిస్థితి కూడా కాస్త విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అమలాపురం రూరల్ సీఐ వీరబాబు సంఘటన స్థాలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.ప్రమాదంలో మృతి చెందిన వారు అందరూ మామిడికుదురు మండలం నగరం కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారిలో 1.సాపే నవీన్ (22) , 2.కొల్లాబత్తుల జతిన్ (26) ,
3.నల్లి నవీన్ కుమార్ (27) , 4.వల్లూరి అజయ్ (18) ఉన్నారు. అందరూ యువకులు, ముప్పై ఏళ్ళలోపు వారే కావడంతో మామిడికుదురు మండలంలో విషాద ఛాయలు అలముకున్నాయి. జతిన్ పుట్టిన రోజునాడే మరణించడం అక్కడ అందరినీ కలిచివేసింది.
Also Read:Breaking: ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి..22 మందికి పైగా గాయాలు..మృతుల్లో చిన్నారులు!