Nizamabad Revenue Officer: నిజామాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB Raids) జరిపిన సోదాల్లో కోట్లాది రూపాయలు బయటపడ్డాయి. మున్సిపల్ సూపరింటెండెంట్ ఇన్‌ఛార్జి రెవిన్యూ ఆఫీసర్ దాసరి నరేందర్‌పై కేసు నమోదు కావడంతో ఏసీబీ అధికారులు ఆయన నివాసంపై సోదాలు జరిపారు. ఇందులో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. రూ.2.93 కోట్ల నగదు, రూ.1.10 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ నరేందర్, అతని భార్య, తల్లి ఖాతాల్లో ఉన్నాయి. అలాగే రూ.6 లక్షల విలువైన 51 తులాల బంగారం, రూ.1.98 కోట్ల విలువైన 17 స్థిరాస్తులను గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం రూ.6.07 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు జరిపిన అనంతరం దాసరి నరేందర్‌ను అరెస్టు చేశారు. ఆయన్ని హైదరాబాద్‌లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ అక్రమాస్తులపై ఏసీబీ విచారణను కొనసాగిస్తోంది.
పూర్తిగా చదవండి..Nizamabad: బయటపడ్డ అక్రమాస్తులు.. రూ.6.07 కోట్లు స్వాధీనం
నిజామాబాద్‌లో మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఇందులో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. అధికారులు మొత్తం రూ.6.07 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
Translate this News: