Haryana: ఎటూ తేలని సీట్ల పంపకం..ఒంటరి పోరుకు ఆప్ సిద్ధం!

హర్యానాలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సీట్ల పంపకం ఎటూ తేలడం లేదు. పొత్తులపై ఇరు పార్టీల స్థానిక నేతల నుంచి వ్యతిరేకత రావడంతో కూటమిగా ముందుకెళ్లడంపై ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో ఆప్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

New Update
Haryana: ఎటూ తేలని సీట్ల పంపకం..ఒంటరి పోరుకు ఆప్ సిద్ధం!

Cong-AAP Seats: హర్యానాలో కాంగ్రెస్, ఆప్ ల మధ్య పొత్తు బెడిసికొట్టినట్లు అవుతోంది. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం విషయంలో ఎన్ని రోజులు చర్చలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎక్కువ సీట్లు ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ అడుగుతూంటే...కాంగ్రెస్ మాత్రం సింగిల్ డిజిట్ లోనే సీట్లు ఇస్తామని చెబుతోంది. జాతీయ స్థాయిలో విపక్షాల కూటమిలో ఉన్న కాంగ్రెస్‌-ఆప్‌లు ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో హరియాణా, గుజరాత్‌, దిల్లీలో కలిసి పోటీ చేశాయి. ప్రస్తుత హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి ముందుకు వెళ్లాలని రెండు పార్టీలు భావించినప్పటికీ సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి. దీంతో ఆప్ ఒంటరిగానే పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పది సీట్లు ఇవ్వాలని ఆప్ డిమాండ్ చేస్తుంటే..కాంగ్రెస్ మాత్రం ఏడు సీట్లు ఇస్తానని చెబుతోందని సమాచారం.

ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ కనుక హర్యానాలో ఒంటరిగా వెళ్ళాలని డిసైడ్ అయితే 50 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నామని చెబుతున్నారు ఆప్ నేతలు. మొదటి లిస్ట్‌ను మరో రెండు రోజుల్లో అంటే సెప్టెంబర్ 8న విడుదల చేసే అవకాశం ఉందన్నారు. ఇక హర్యానాలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ బీజేపీ, కూటమిలకు మధ్య గట్టి పోటీ ఉంది. బీజేపీ ఇప్పటికే తన ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేసింది. కాంగ్రెస్, ఆప్‌లు ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేస్తారు.

Also Read: Andhra Pradesh: కేంద్రం సాయం ఇంకా అందలేదు–చంద్రబాబు

Advertisment
తాజా కథనాలు