AAP : మద్యం కేసులో మరో ట్విస్ట్.. ఛార్జ్‌షీట్‌లో 'ఆప్‌' పేరును చేర్చనున్న ఈడీ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈడీ దాఖలు చేయనున్న ఛార్జ్‌షీట్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్లను నిందితులుగా చేర్చనుంది.

New Update
AAP : మద్యం కేసులో మరో ట్విస్ట్.. ఛార్జ్‌షీట్‌లో 'ఆప్‌' పేరును చేర్చనున్న ఈడీ

Liquor Case : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో(Delhi Liquor Scam Case) మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈడీ(ED) దాఖలు చేయనున్న ఛార్జ్‌షీట్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP), ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) పేర్లను నిందితులుగా చేర్చనుంది. ఈడీ చరిత్రలో ఓ జాతీయ పార్టీ పేరును నిందితుల జాబితాలో చేర్చనుండటం ఇదే తొలిసారి. అలాగే ఆ పార్టీ ఆస్తుల్లో కొన్నింటిని అటాచ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. సుప్రీం కోర్టులో ఈరోజు కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌పై విచారణ జరిగిన అనంతరం ఈడీ.. ఈ ఛార్జ్‌షీట్‌ను సమర్పించే అవకాశం ఉంది.

Also Read: ప్రపంచంలోని సంపన్న నగరాలు ఇవే.. మన సిటీలు కూడా ఉన్నాయ్! 

ఒక వేళ ఈరోజంతా వాదనలు జరిగినట్లైతే రేపు కోర్టుకు దీన్ని సమర్పించవచ్చు. ఇందులో కేజ్రీవాల్, ఆప్‌తో పాటు మరికొందరు నిందితులు, వారికి సంబంధించిన సంస్థల పేర్లను కూడా ప్రస్తావించనున్నారు. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించిన డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందనే విషయాలు ఈడీ ఇందులో నిరూపించే అవకాశాలున్నాయి. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద వీళ్లపై కేసులు నమోదు చేయనున్నారు.

లిక్కర్ స్కామ్‌లో మార్చి 21న అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్.. అప్పటి నుంచి తీహార్ జైల్లోనే ఉంటున్నారు. ఇటీవల ఆయన ఎన్నికల నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆయనకు బెయిల్‌ ఇవ్వడాన్ని ఈడీ వ్యతిరేకించింది. ఎన్నికల ప్రచారం అనేది ప్రాథమిక హక్కు కాదని.. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడికి కూడా ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వలేదని పేర్కొంది. దీనిపై ఈడీ (ED) డిప్యూటీ డైరెక్టర్‌ భానుప్రియ కోర్టుకు అఫిడవిట్‌ దాఖలు చేశారు. అయితే రేపు సుప్రీంకోర్టు కేజ్రీవాల్ బెయిల్‌పై ఎలాంటి తీర్పు ఇవ్వనుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read: దేశంలో పెట్రోల్,డీజిల్ కొత్త ధరలు ఇలా ఉన్నాయి..

Advertisment
Advertisment
తాజా కథనాలు