Kolkata : ఒకేసారి ఇద్దరు యువకులతో ప్రేమ వ్యవహారం(Illegal Affair) కొనసాగించిన యువతి చివరికి దారుణానికి ఒడిగట్టింది. కొంతకాలం సాఫీగా సాగిన దొంగచాటు వ్యవహారం ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగడంతో పక్కా ప్రణాళికతో ఒకరిని కడతేర్చింది. ఈ భయంకరమైన ఘటన అస్సాం(Assam) లోని గువాహటిలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కార్ల డీలరుతో పరిచయం..
ఈ మేరకు పోలీసులు తెలిపన వివరాల ప్రకారం.. కోల్కతా(Kolkata) కు చెందిన అంజలి షా(Anjali Shaw) (25) కోల్కతా విమానాశ్రయంలోని రెస్టారెంటులో ఉద్యోగం చేస్తోంది. అయితే ఆమె వికాశ్ షా(Vikas Shaw) (27) అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమలో ఉంది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం మహారాష్ట్ర(Maharashtra) లోని పుణెకు చెందిన సందీప్ కాంబ్లీ(Sandeep Kamble) (42) అనే కార్ల డీలరుతో అంజలికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే అంజలితో సన్నిహితంగా ఉన్నపుడు ఫొటోలు తీసిన కాంబ్లీ.. అంజలిని వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయం ప్రియుడు వికాశ్కు చెప్పింది. దీంతో ఎలాగైనా కాంబ్లీని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశారు.
కోల్కతాకు రావాలని పిలిచి..
ఒకరోజు కాంబ్లీకి ఫోన్ చేసి కోల్కతాకు రావాలని అంజలి పిలిచింది. అయితే అక్కడికి రావడం కుదరదని, సోమవారం గువాహటికి వస్తున్నానని చెప్పిన కాంబ్లీ.. అక్కడే ఓ 5స్టార్ హోటలులో రూమ్ బుక్ చేశాడు. వికాశ్ కూడా అదే హోటలులో వేరే గది తీసుకున్నాడు. అంజలి, కాంబ్లీ ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో గదిలోకి చొరబడిన వికాశ్ అతడిపై ఘోరంగా దాడి చేశాడు. కుప్పకూలిన కాంబ్లీని అక్కడే వదిలేసి.. అతడి ఫోను తీసుకొని ఇద్దరూ పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత కాంబ్లీ చనిపోయినట్లు గమనించిన హోటలు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
ఇది కూడా చదవండి : Santiago : హెలికాప్టర్ కూలి చిలీ మాజీ అధ్యక్షుడు మృతి.. వీడియో వైరల్
సీసీటీవీ ఫుటేజీ, విమానాశ్రయ ప్రయాణికుల లిస్ట్ పరిశీలించి పరిశీలించిన పోలీసులు.. ఎయిర్పోర్టుకు దగ్గర్లోని ఓ హోటలులో ఉన్న అంజలి, వికాశ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.