Youtube: యూట్యూబ్‌ ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ప్రశ్నాపత్రాలు లీక్‌ చేసిన టీచర్

యూట్యూబ్‌ ఛానల్‌లో ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ఒడిశాలోని ఓ ఉపాధ్యాయుడు.. ఏకంగా 1 నుంచి 8వ తరగతి వరకు ప్రశ్నపత్రాలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. దీంతో సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు

Youtube: యూట్యూబ్‌ ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ప్రశ్నాపత్రాలు లీక్‌ చేసిన టీచర్
New Update

యూట్యూబ్‌ ఛానల్‌లో ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు యూట్యూబర్లు వివిధ రకాల కంటెంట్‌లతో వీడియోలు చేస్తూ ఉంటారు. కానీ ఒడిశాలోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాత్రం.. తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఎక్కువమంది ఫాలోవర్స్‌ను పెంచుకునేందుక ఏకంగా 1 నుంచి 8వ తరగతి వరకు పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్‌ చేశాడు. తన భార్య పేరు మీదుగా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న అతడు.. ప్రశ్నలను అందులో అప్‌లోడ్ చేసేవాడు. దీంతో ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఉపాధ్యాయుడు అతని భార్య, మరో వ్యక్తిని అరెస్టు చేశారు.

Also Read: మోడీ రోడ్‌ షోలో ప్రమాదం.. వేదిక కూలి పలువురికి గాయాలు!

పరీక్షలకు ముందుగానే ప్రశ్నపత్రాలు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడం వల్ల ఇవి వైరల్ అయ్యాయి. దీంతో ఒడిశా స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ అథారిటీ డైరెక్టర్‌ మార్చి18న భువనేశ్వర్‌ సైబర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఆ ఉపాధ్యాయుడిని గుర్తించారు. నిందితుడు గంజాం జిల్లాలోని రంభ అనే ప్రాంతానికి చెందిన సమీర్‌ సాహు అని తెలిపారు. 'సమీర్‌ ఎడ్యుకేషన్' అనే ఛానల్‌లో అతడు ప్రశ్నపత్రాలు అప్‌లోడ్‌ చేసినట్లు తెలియడంతో ముందుగా పోలీసులు అతడి ఇంటికి వెళ్లారు. మార్చి 30న అతని వద్ద ఉన్న ప్రశ్నపత్రాలు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.

తన యూట్యూబ్ ఛానల్‌లో పాటు.. ప్రో ఆన్సర్ అనే మరో యూట్యూబ్‌ ఛానల్‌లో కూడా ప్రశ్నపత్రాలు అప్‌లోడ్ చేసినట్లు.. సమీర్‌ పోలీసులుకు విచారణలో వెల్లడించాడు. జాజ్‌పూర్‌లోని ఓ బడిలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న జగన్నాథ్ కర్, అతని భార్య రూతుపూర్ణ ఈ పని చేసినట్లు పేర్కొన్నాడు. దీంతో ఈ దంపతులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. లీకైన ప్రశ్నపత్రాలతో పాటు ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ కీలక నిర్ణయం

#telugu-news #national-news #youtube #youtubers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe