Modi: మోడీ రోడ్ షోలో ప్రమాదం.. వేదిక కూలి పలువురికి గాయాలు! జబల్ పూర్ లో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో రావడంతో ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి. By Bhavana 08 Apr 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Modi: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలన్ని కూడా తమ ప్రచారాల్లో ఫుల్ బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోడీ మధ్యప్రదేశ్‌లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జబల్‌పూర్‌లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ రోడ్ షోకు భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు హాజరయ్యారు. ఇదిలా ఉంటే, రోడ్ షోలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. వేదిక ఒక్కసారిగా కుప్పకూలడంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్ షో నిర్వహిస్తున్న మోడీని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, జబల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఆశిష్ దూబే, రాష్ట్ర కేబినెట్ మంత్రి రాకేష్ సింగ్ ఉన్నారు. ఈ సందర్భంగా రోడ్డుకు రెండు వైపులా అధిక సంఖ్యలో ఉన్న ప్రజల వీడియోను ప్రధాని మోటీ ట్వీట్ చేశారు. జబల్ పూర్ రోడ్ షో అద్భుతం అంటూ వర్ణించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలోని క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన రాకేష్ సింగ్ 2004, 2019 మధ్య జబల్ పూర్ నుంచి వరసగా నాలుగుసార్లు లోక్ సభ స్థానానికి గెలిచారు. అయితే, ఈ సారి బీజేపీ ఆయనకు కాకుండా కొత్త వ్యక్తి అయిన ఆశిష్ దూబేని రంగంలోకి దించింది. ఆశిష్ కాంగ్రెస్ అభ్యర్థి దినేష్ యాదవ్‌తో పోటీ లో ఉన్నారు. Also read: రోజురోజుకి పెరుగుతున్న వేడి నుంచి బయటపడటానికి ఈ చిట్కాలు పాటించండి! #modi #mp #jabalpur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి