సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ దారుణ హత్య.. గొలుసుతో కట్టేసి, బ్లేడుతో కోసి

ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయిని అనుమానంతో అత్యంత దారుణంగా చంపిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులైన నందిని 25, వెట్రిమారన్‌ 26 కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నందిని మరో అబ్బాయితో క్లోజ్ ఉంటుందనే కోపంతో వెట్రిమారన్ ఆమెను గొలుసుతో కట్టేసి, బ్లేడుతో కోసి చంపాడు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ దారుణ హత్య.. గొలుసుతో కట్టేసి, బ్లేడుతో కోసి
New Update

Software Engineer Love Murder : ప్రేమించిన అమ్మాయిని(Lover) ఓ యువకుడు అత్యంత దారణంగా హింసించి చంపిన ఘటన తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రంలో సంచలనం రేపింది. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్ లో చదివి, తర్వాత ఉద్యోగ జీవితంలోనూ ఒకే కంపెనీలో జాయిన్ అవగా.. కొంతకాలంగా ప్రేమిస్తున్నానని నమ్మించి ఆమెను బుట్టలో వేసుకున్న ఆ సైకోగాడు నెమ్మదిగా తన పైచాచికత్వం బయటపెట్టాడు. ఒకే దగ్గర ఉద్యోగం చేస్తుండటం, బాల్య స్నేహితుడు కావడంతో ఆమె కూడా స్వేచ్ఛగా ఉండేది. అయితే ఆఫీసులోనూ ఇతర పురుషులతో ఆమె క్లోజ్ గా ఉండటం మింగుడు పడని యువకుడు కక్షపెంచుకుని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ అయిన 25 ఏళ్ల యువతిని కిరాతకంగా చంపేశాడు.

ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై(Chennai) సమీపంలోని తాలంబూర్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులైన నందిని(Nandhini) (25), వెట్రిమారన్‌(Vetrimaran) (26) మధురై(Madurai) లోని ఒకే ఉన్నత పాఠశాలలో స్కూల్ ఎడ్యుకేషన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత కొంతకాలంగా ప్రేమలోపడ్డారు. ఇటీవలే వీరిద్దరూ ఎనిమిది నెలల క్రితం ఒకే కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఈ క్రమంలో నందిని మరెవరితోనో చనువుగా ఉంటున్నదని వెట్రిమారన్‌ అనుమానించాడు. ఆ అనుమానమే పెనుభూతమై అతడిని హంతకుడిని చేసింది. నుమానంతో నందినిని చంపాలని నిర్ణయించుకున్న వెట్రిమారన్‌ శనివారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లి ఒంటరిగా ఉన్న ఆమెపై బ్లేడుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్న ఆమెను గొలుసులతో బంధించాడు. అనంతరం ఆమె బతికుండగానే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఇది కూడా చదవండి : <"https://rtvlive.com/allu-arjun-revealed-interesting-facts-about-his-father-allu-aravind-telugu-news/">తండ్రిపై అల్లు అర్జున్ సంచలన ఆరోపణలు.. ఆ సినిమా డబ్బులివ్వలేదంటూ

ఇక వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సగానికంటే ఎక్కువగా కాలిపోయి ఉన్న మృతదేహాన్ని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు వెట్రిమారన్‌ను అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్‌ కస్టడీకి పంపారు. అయితే నందిని హత్య వెనుక ఓ ట్రాన్స్‌జెండర్‌ పాత్ర కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

#murder #tamil-nadu #nandini #love #murdered #software-engineers #vetrimaran
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe