శ్రీకాకుళం జిల్లా రాజాంలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. సైట్ ఇంజినీర్ రామకృష్ణ కార్యాలయ ప్రాంగణలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న సిబ్బంది అతడ్ని చూసి షాకయ్యారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరపుతున్నారు. అయితే ఉన్నతాధికారుల వేధింపుల వల్లే రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Also Read: పొగమంచు ఎఫెక్ట్.. గన్నవరం ఎయిర్‌పోర్టులో చక్కర్లు కొట్టిన విమానాలు.. చివరికి
కఠినంగా శిక్షించాలి
తన భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని రామకృష్ణ భార్య ఉమ చెబుతున్నారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఈఈ, డీఈల వేధింపుల వల్లే మా నాన్నని దూరం అయ్యారని కుమార్తెలు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈఈ, డీఈలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
రామకృష్ణపై ఆరోపణలు
ఇదిలాఉండగా.. పంచాయతీ రాజ్ పనుల్లో సిమెంట్ కుంభకోణంలో రామకృష్ణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత రెండు నెలలుగా ఉన్నతాధికారులు వేతనాలు నిలిపివేశారు. ఈ కారణంతోనే రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈఈని అదుపులోకి తీసుకున్నారు. అయితే డీఈ పరారీలో ఉండగా.. అతడి కోసం గాలిస్తున్నారు.
Also read: రైల్వేలో 5,696 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి.