Vyuham Teaser: ‘వ్యూహం’ టీజర్‌పై రాజకీయ దుమారం.. టార్గెట్‌ వాళ్లే.. ఆర్జీవీ పంచ్‌లు

రామ్‌గోపాల్‌ వర్మ నిత్యం ఏదో ఒక న్యూస్‌తో సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఎంత పెద్ద నిజం అయిన మొహమాటం లేకుండా మాట్లాడి వార్తల్లో నిలుస్తారు. తాజాగా వ్యూహం మూవీతో ఆసక్తికర పోస్టులతో రచ్చ చేస్తున్నారు ఆర్జీవీ.

Vyuham Teaser: ‘వ్యూహం’ టీజర్‌పై రాజకీయ దుమారం.. టార్గెట్‌ వాళ్లే.. ఆర్జీవీ పంచ్‌లు
New Update

Vyuham Teaser: ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్‌లో సూపర్ హిట్ సినిమాలు అందించిన ఆర్జీవీ (RGV) చాలా రోజుల తర్వాత వ్యూహం సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ముఖ్యంగా ఏపీ రాజకీయాలపై తీస్తునట్ల సమాచారం. అయితే మాజీ సీఎం దివంగత వైఎస్‌ఆర్ (YSR) హెలికాఫ్టర్‌ ప్రమాదంలో చనిపోయిన తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏం చేశారు?.. సీఎం అయ్యే వరకు ఏం జరిగిందని ఈ సినిమాలో చూపించనున్నారు.

ఆర్జీవీ సీఎం జగన్‌కు (CM Jagan) సపోర్ట్‌గానే మాట్లాడుతున్నారనే చెప్పాలి. గత ఎలక్షన్స్ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ టైంకి వ్యూహం అనే పొలిటికల్ సినిమాతో రాబోతున్నారు. జగన్‌కి సంబంధించిన కథతో వ్యూహం (Vyuham) అనే సినిమాను రెండు పార్టులుగా తీస్తున్నారు. మొదటి పార్ట్ ఈసంవత్సరం, రెండవ పార్ట్ ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తానని ఆర్జీవీ ప్రకటించారు. ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది వ్యూహం మొదటి పార్ట్‌లో చూపిస్తారట. ఇప్పటికే వ్యూహం నుంచి ఒక టీజర్ విడుదల చేయగా తాజాగా వ్యూహం సినిమా నుంచి మరో టీజర్‌ని ఆర్జీవీ విడుదల చేశారు.

సినిమాలో నిజంగా బట్టలు విప్పి చూపిస్తా...!

టీడీపీ (TDP)లో అందరికీ బట్టలు విప్పడం తెలుసు.. మాట్లాడితే బట్టలు విప్పుతూ ఉంటారు. అందుకే నేను ఈ సినిమాలో నిజంగా బట్టలు విప్పి చూపిస్తా అన్న వ్యాఖ్యలు ఇప్పుడు రచ్చ అవుతోంది. ఈ మూవీ నా ఇష్టంతో తీశానని.. ఇందులు జగన్‌ రియాల్టీ చూపించడం కోసమే ఈ మూవీ తీశానని ఆర్జీవీ చెప్పుతున్నారు. నేను నమ్మిన నిజాన్ని తీశాను. ఎలాంటి ఆధారాలు చూపిస్తాను అనేది సినిమాలో చూడాలని అన్నారు. ఈ సినియా తీయాలని నన్ను ఎవరూ అడగలేదు..! నేను వైసీపీ కోసయో.. మరెవరి కోసమో మూవీని తీయను.. నాకు ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేదన్నారు. నాకు తెలిసింది రాజకీయాల్లో జరిగిందాన్ని బట్టి నేను కథ రాసుకొని నా అభిప్రాయాన్నే నేనే సినిమాగా తీశాను అంతేకాని జగన్‌ను, చంద్రబాబుని నెగెటివ్‌, పాజిటివ్‌ చేయడానికి కాదని ఆర్జీవీ అంటున్నారు.

ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో...

నాకు జగన్‌ అంటే నాకు ఇష్టం.. కథ పరంగా నా ఉద్దేశం ఇదే అంటూన్నారు ఆర్జీవి. ఇక ఈ టీజర్‌లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణించిన తర్వాత పరిస్థితులు చూపించారు. ఇక ఇందులో జగన్, జగన్ కుటుంబ పాత్రలతో పాటు చంద్రబాబు (Chandrababu), రోశయ్య, మన్మోహన్ సింగ్, పవన్ కళ్యాణ్(Pawan Kalyan), చిరంజీవి (Chiranjeevi), అల్లు అరవింద్, సోనియా గాంధీ..ఇలా అనేకమంది పాత్రలని ఆర్జీవీ చూపించారు. ఏపీలో ఎన్నిక టైం దగ్గర పడుతోంది.. మరి ఈ మూవీ ఏపీ రాజకీయలో ఎన్ని ప్రకంపనలు తెస్తుందో వేచి చూడాల్సిందే.

Also Read: గుంటూరు కారం.. లిరికల్ వీడియో రెడీ అవుతోంది

#rgv-vyuham-movie #ramgopal-varmas-vyooham #rgv-vyuham #rgv-vyooham-teaser #political-dumaram #vyuham-teaser #ramgopalvarma #rgv-vyuham-trailer-released #ramgopal-varm-vyuham #vyooham-teaser #vyooham-trailer
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe