Vyuham: ఈ నెల 16న వ్యూహం సినిమా రిలీజ్
ఆర్జీవీకి బిగ్ రిలీఫ్ లభించింది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై ఇటీవల ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకు తొలిగింది. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.
ఆర్జీవీకి బిగ్ రిలీఫ్ లభించింది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై ఇటీవల ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకు తొలిగింది. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.
వ్యూహం సినిమాపై వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు.. రేపు సినిమాపై ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వనుంది. ఏపీలో ఎన్నికలపై ప్రభావం ఉంటుందనుకుంటే, తెలంగాణలో అయినా విడుదలకు అనుమతి ఇవ్వాలని RGV అడ్వకేట్ కోరగా అభ్యంతరం వ్యక్తం చేశారు లోకేష్ తరుఫు న్యాయవాది.
వ్యూహం సినిమాని థియేటర్స్ తో పాటు ఒకేరోజు ఒకే సమయానికి ఏపీ ఫైబర్ నెట్ లో కూడా రిలీజ్ చేస్తున్నామని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. కేవలం రామ్ గోపాల్ వర్మ అడిగినందునే కార్పొరేషన్ ద్వారా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
RGV 'వ్యూహం' సినిమా ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది.Y.S రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ పొలిటికల్ ఎంట్రీ బ్యాక్ డ్రాప్ నేపథ్యంగా RGV ఈ సినిమాను తెరెకెక్కించారు.
రామ్‌గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక న్యూస్‌తో సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఎంత పెద్ద నిజం అయిన మొహమాటం లేకుండా మాట్లాడి వార్తల్లో నిలుస్తారు. తాజాగా వ్యూహం మూవీతో ఆసక్తికర పోస్టులతో రచ్చ చేస్తున్నారు ఆర్జీవీ.