Kishan Reddy Press Meet: కొత్త ఎన్నికల కమిటీని ఏర్పాటు చేస్తున్నాం-కిషన్ రెడ్డి

వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం కొత్త ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ నెల 7,8 తేదీల్లో బీజేపీ నేతల సమావేశం ఉంటుందని తెలిపారు. సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారెంటీ అన్న మాటల్లా వాస్తవం లేదని కొట్టిపారేశారు.

Kishan Reddy: అందుకే పోలింగ్ శాతం తగ్గింది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
New Update

Kishan Reddy:లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ కసరత్తులు మొదలుపెట్టింది. వీటి కోసం కొత్త ఎన్నికల కమిటీని పెట్టుకోవాలని అనుకుంటోంది. ఈ విషయాన్ని ఇవాళ మీడియా బిట్ చాట్ ధృవీకరించారు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. దీనికి సంబంధించి ఈ నెల 7,8 తేదీల్లో సమావేశం ఉంటుందని తెలిపారు.సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారంటీ అని ఎక్కడా చర్చ జరగలేదు.సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారంటీ అనే వార్తలు బేస్ లెస్ అంటూ కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. అలాగే మంద కృష్ణ మాదిగ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసే అంశం కూడా చర్చకు రాలేదని చెప్పారు. ఆయన మాదిగ రిజర్వేషన్ల కోసం పనిచేస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మాకు మద్దతునిచ్చిన మాట వాస్తవమే అయినా...దాని కోసం ఇప్పుడు ఆయనకు ఎంపీ సీటు ఇస్తామని అయితే కచ్చితంగా చెప్పలేమని అన్నారు.

Also Read:జనవరి 1 నుంచి మారిన యూపీఐ కొత్త రూల్స్ ఇవే…

ఇక దీంతో పాటూ ఎల్సీ నేత గుఇంచి మాట్లాడారు కిషన్ రెడ్డి. మొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చినప్పుడే ఎల్పీ నేత ప్రకటన చేయాల్సి ఉంది కానీ ఆయన రావడం లేటవడంతో ఆరోజు చేయలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చే పరిశీలకులు ఎల్పీ నేత పై ప్రకటన చేస్తారని తెలిపారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మహిళలకు, బిసిలకు పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం 90 డేస్ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నామని...ఈసారి అన్ని రకాలుగా తయరవుతామని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి చివరన లేదా మార్చి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అలాగే తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఉండకపోవచ్చని అన్నారు కిషన్ రెడ్డి.ఏపీలో కూడా జనసేనతో బీజేపీ పొత్తు అంశం చర్చకు రాలేదని చెప్పారు.కానీ జనసేన మాత్రం ప్రస్తుతం NDA లో భాగస్వామిగా ఉందని అన్నారు. ఎవరూ లేకుండానే బీజేపీకి ఓట్లు వేయడానికి జనాలు సిద్దంగా ఉన్నారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచినా ఎవరికి ప్రయోజనం లేదని..ఆ పార్టీ ఈసారి పెద్దగా చేసేదేం ఉండదన్నారు.

అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. ఇది
భవిష్యత్ లో అక్కడి ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయ్యప్ప భక్తులకు కనీస సదుపాయాలు కల్పించలేకపోతుందని కేరళ ప్రభుత్వాన్ని విమర్శించారు.

#telangana #bjp #elections #kishan-reddy #press-meet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe