Minister Harish Rao: తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన పదేళ్లలోనే నూరేళ్ల అభివృద్ధి!

సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన పదేళ్లలోనే నూరేళ్ల అభివృద్ధి జరిగిందన్నారు.

New Update
Minister Harish Rao: తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన పదేళ్లలోనే నూరేళ్ల అభివృద్ధి!

Minister Harish Rao About Telangana Development: సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ (77th Independence Day) వేడుకల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన పదేళ్లలోనే నూరేళ్ల అభివృద్ధి జరిగిందన్నారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే దిక్సూచిగా మారాయని ఆయన స్పష్టం చేశారు. ఇక సీఎం కేసీఆర్ (CM KCR)సారధ్యంలో తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్ గా చెప్పుకునే నీళ్లు, నిధులు,నియామకాలను సాకారం చేసుకున్నామన్నారు. అదే విధంగా సిద్ధిపేట ట్యాగ్ లైన్ గా భావించిన జిల్లా ఏర్పాటు, గోదావరి జలాలు, రైలు సౌకర్యాన్ని సాధించుకున్నామన్నారు. ఈ విషయాన్ని స్వాతంత్ర్యదినోత్సవం రోజున చెప్పుకోవడం గర్వంగా ఉందన్నారు.

కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన రంగనాయకసాగర్, శ్రీ కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, గౌరవెల్లి రిజర్వాయర్లతో గోదావరి జలాలను జిల్లాలోని గ్రామగ్రామన పారిస్తున్నామన్నారు.నర్మెటలో 300 కోట్లతో ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందన్నారు. సిధిపేటలోని పారిశ్రామికవాడలో ఆటోనగర్ నిర్మాణం చేపట్టి 400 మంది మెకానిక్ లకు స్థలాలను అందజేయడం జరుగుతుందన్నారు.

దివ్యాంగులకు 4 వేల 16 రూపాయలు, మిగతా వర్గాలకు 2 వేల, 16 రూపాయలను అందిస్తోంది ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వమే (BRS Govt) అన్నారు. 99,999 రూపాయల వరకు జిల్లాలో 81 వేల 565 మందికి 418 కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. 50 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు టార్గెట్ గా ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. ఒక లక్షా 92 వేల మందికి ప్రతీనెల 40 కోట్ల పింఛన్ లబ్దిదారుల ఖతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో స్వాతంత్ర్య సమరయోధులను మంత్రి హరీష్ రావు ఘనంగా సత్కరించారు. జూనియర్ గ్రామ కార్యదర్శులకు ఆయన నియామక పత్రాలను అందజేశారు.

Also Read: ‘బీజేపీ 100 అబద్దాల’పై సీడీ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్!

Advertisment
తాజా కథనాలు