Telangana Elections: కాంగ్రెస్లో 10 మంది సీఎంలు ఉన్నారు, జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా కూడా గెలవడు : హరీష్రావు
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి అవుతా అంటున్నారని కానీ ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవరని మంత్రి హరీష్ రావు అన్నారు. జానారెడ్డి పోటీ చేయకున్న సీఎం అవుతా అంటున్నారని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్లో 10 మంది సీఎంలు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.