Water Wastage: నీరు వృథా చేస్తే రూ.5 వేలు ఫైన్.. ఎక్కడంటే

బెంగళూరులోని కనకపుర, యల్హంక, వైట్‌ఫీల్ట్‌ ప్రాంతాల్లో ఉండే స్థానికులు వేసవి పూర్తిస్థాయి రాకముందే నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నీరు వృథా చేసిన వారికి రూ.5 వేలు ఫైన్ విధిస్తామని ఓ హౌసింగ్ సొసైటీ హెచ్చరించింది.

New Update
Water Wastage: నీరు వృథా చేస్తే రూ.5 వేలు ఫైన్.. ఎక్కడంటే

Bengaluru: వేసవి కాలం వచ్చిందంటే చాలా ప్రాంతాల్లో నీటి కొరత ఉంటుంది. సమయానికి నీళ్లు లేక ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. అయితే బెంగళూరులోని కొన్ని ప్రాంతాల ప్రజలు వేసవి పూర్తిస్థాయిలో రాకముందే.. నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నేఫథ్యంలో ఓ హౌసింగ్ సోసైటీ.. నీరు వృథా చేస్తే ఏకంగా రూ.5 వేల ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని కనకపుర, యల్హంక, వైట్‌ఫీల్ట్‌ ప్రాంతాల్లో ఉండే స్థానికులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో నివసించేవారు ఎవరైనా ఎక్కువగా నీటిని వినియోగిస్తే.. వాళ్లకి రూ.5వేలు జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు దీన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సెక్యురిటీని కూడా నియమించనున్నట్లు చెప్పింది.

Also Read: 10 లక్షల ఉద్యోగాలే ప్రధానాంశంగా కాంగ్రెస్ మేనిఫెస్టో..రాహుల్ హామీ

20 శాతం నీటిని తగ్గించాలి 

'బెంగళూరు నగరపాలక సంస్థ వాటర్ బోర్డు నుంచి గత నాలుగు రోజులుగా నీరు రావడం లేదు. ఇప్పుడు బోర్ల నుంచి నీళ్లు అందిస్తున్నాం. హౌసింగ్ సొసైటీలో ఉంటున్నవారు నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించాలని కోరుతున్నాం. ఇలా చేస్తే వేసవిలో ఎక్కువ రోజులు నీళ్లు వాడుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే.. వాళ్లకు రూ.5 వేలు జరిమానా విధిస్తాం. ఇందుకోసం ప్రత్యేకంగా నియమించిన భద్రతా సిబ్బంది నీటి వాడకాన్ని పర్యవేక్షిస్తారని' వైట్‌ఫీల్డ్‌లోని పామ్‌ మిడోస్ హౌసింగ్ సొసైటీ అక్కడ ఉంటున్న వారికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది.

కర్ణాటక ప్రభుత్వం కీలక ప్రకటన 

ఇదిలాఉండగా.. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కర్ణాటక సర్కార్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నగరంలోని ట్యాంకర్ల యజమానులు మార్చి 7 నాటికి తప్పకుండా ప్రభుత్వం వద్ద వివరాలు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు రూ.556 కోట్లు మంజూరు చేశామని డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. అంతేకాదు బెంగళూరులో ప్రజల కోసం తమవంతుగా రూ.10 కోట్లు ఇవ్వాలని నియోజకవర్గ ఎమ్మెల్యేలను ఆయన కోరారు.

Also read: ఎలక్టోరల్ బాండ్లపై మల్లిఖార్జున ఖర్గే సంచలన ఆరోపణలు

Advertisment
Advertisment
తాజా కథనాలు