/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/crime-jpg.webp)
పునుగు గొంతులో ఇరుక్కుని పసికందు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని మారుతి, కవితల కుమారుడు క్రాంతి కుమార్(13 నెలలు) సోమవారం సాయంత్రం ఇంట్లో చేసిన పునుగును నోట్లో పెట్టుకున్నాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/a-child-died-after-getting-stuck-in-throat-of-punugu-in-mustabad.webp)
అయితే అది గొంతులో ఇరుక్కుని ఊపిరి ఆడక మృతి చెందాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. అప్పటికే బిడ్డ మృతి చెందాడని వైద్యులు చెప్పారు.
అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు కళ్లెదుటే మృతి చెందడంతో తల్లి కవిత రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. రెండేళ్ల క్రితమే కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా నుంచి ముస్తాబాద్ కు వారు ఉపాధి నిమిత్తం వచ్చారని స్థానికులు తెలిపారు.
Follow Us