Madhulatha: మేకలు కాస్తూ ఐఐటీ పాట్నాలో సీటు.. తెలంగాణ బిడ్డ మధులత సక్సెస్ స్టోరీ!
మేకలు కాస్తూ ఐఐటీ పాట్నాలో సీటు సాధించిన సిరిసిల్ల జిల్లాకు చెందిన పేద విద్యార్థిని బదావత్ మధులతకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మధులత కోర్సుకు కావాల్సిన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. విద్యార్థినికి రూ.1,51,831 చెక్కును అందజేశారు.